ETV Bharat / city

క్రీడా శిక్షకుల కొరత.. పోటీలో వెనుకబడుతున్న రాష్ట్రం - telangana sports news

జాతీయస్థాయి పతకాల పట్టికల వేటలో తెలంగాణ వెనుకబడిపోతోంది. రాష్ట్రంలోని క్రీడా పాఠశాలలు, అకాడమీల్లో ప్రభుత్వాలు గత కొన్నేళ్లుగా క్రీడా శిక్షకుల పోస్టులను భర్తీ చేయడం లేదు. శిక్షకుల కొరత కారణంగా ప్రతిభ ఉన్న క్రీడాకారులు తమ ఉజ్వల భవిష్యత్తును కోల్పోతున్నారు.

Telangana lagging behind in national level competition
జాతీయ స్థాయి పోటీలో వెనుకబడుతున్నతెలంగాణ
author img

By

Published : Mar 15, 2021, 7:23 AM IST

రాష్ట్ర క్రీడా ప్రాధికారక సంస్థ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌, కరీంనగర్‌, హకీంపేట ప్రాంతాల్లో క్రీడా పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటిలో 22 మంది క్రీడా శిక్షకులు విధులు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా వనపర్తి(హాకీ), వరంగల్‌(అథ్లెటిక్స్‌, హ్యాండ్‌బాల్‌, జిమ్నాస్టిక్స్‌), ఖమ్మం(అథ్లెటిక్స్‌), హైదరాబాద్‌(సైక్లింగ్‌, రెజ్లింగ్‌), సరూర్‌నగర్‌(వాలీబాల్‌)లోని క్రీడా అకాడమీల్లో 8 మంది క్రీడా శిక్షకులు కాంట్రాక్ట్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ గ్రాంట్‌ కింద విధులు నిర్వహిస్తున్నారు. వీటిలో సరిపడా శిక్షకులు లేని కారణంగా ఉత్సాహవంతులు క్రీడల్లో వెనకబడిపోతూ పతకాలను సాధించలేకపోతున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 1992లో అప్పటి ప్రభుత్వం 33 మంది క్రీడా శిక్షకులను నియమించింది. ఇప్పుడు వారంతా పదవీ విరమణ పొందారు. తరవాత 1993, 1999, 2009లలో ఒప్పంద ప్రాతిపదికన మాత్రమే క్రీడా శిక్షకులను నియమించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కొత్తగా ఆదిలాబాద్‌లో క్రీడా పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆ పాఠశాలను నలుగురు శిక్షకులతో నడిపిస్తున్నారు.

శిక్షణ పూర్తి చేసిన వారు ఉన్నా..

క్రీడా శిక్షకులు కావాలనుకునేవారు భారత క్రీడా ప్రాధికారక సంస్థ ఆధ్వర్యంలో నడిచే ఎన్‌ఎస్‌ఎన్‌ఐఎస్‌(నేతాజీ సుభాష్‌ జాతీయ క్రీడా సంస్థ)లో ఏడాది పాటు శిక్షణలో చేరుతారు. ఆ శిక్షణను పూర్తి చేసినవారు మన రాష్ట్రంలో 150కి పైగానే ఉన్నారు. ప్రభుత్వం క్రీడా శిక్షకుల నియామకాన్ని చేపట్టకపోవడంతో వారిలో చాలామంది ప్రైవేటు పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్రంలోని క్రీడా పాఠశాలలు, అకాడమీల్లో శిక్షకులను నియమించి ఆటల్లో ఆణిముత్యాలను వెలుగులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.