ETV Bharat / city

మళ్లీ ఉత్తర్వులు ఇచ్చేవరకు కోర్టుల్లో లాక్​డౌన్ - Covid-19 latest updates

కరోనా విస్తృతి నేపథ్యంలో హైకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో మార్చి 31 వరకు ఇచ్చిన కోర్టుల మూసివేత ఉత్తర్వులను పొడిగిస్తూ... తాజా ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర పిటిషన్లను న్యాయవాదులు ఈమెయిల్ ద్వారా దాఖలు చేయాలని పేర్కొంది.

high court
high court
author img

By

Published : Mar 27, 2020, 7:47 PM IST

రాష్ట్రంలోని న్యాయవ్యవస్థను ఏప్రిల్ 14 లేదా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ లాక్​డౌన్ చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. గతంలో మార్చి 31 వరకు ఇచ్చిన కోర్టుల మూసివేత ఉత్తర్వులను పొడిగిస్తూ... తాజా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని రకాల న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు, న్యాయసేవ, మధ్యవర్తిత్వ కేంద్రాలన్నీ ఏప్రిల్ 14 వరకు పనిచేయవని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. తదుపరి విచారణ తేదీలను న్యాయవాదులు, కక్షిదారులు వెబ్​సైట్ల ద్వారా తెలుసుకోవాలని సూచించింది.

అత్యవసర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్

ఉద్యోగులెవరూ కోర్టు కార్యాలయాలకు రావల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే జిల్లా కేంద్రం విడిచి వెళ్లవద్దని.. అత్యవసరమైతే విధులకు హాజరయ్యేలా సిద్ధంగా ఉండాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అత్యవసర అంశాల కోసం జిల్లా జడ్జిలు, మెజిస్ట్రేట్లు, రొటేషన్​పై విధుల్లో ఉండాలని హైకోర్టు తెలిపింది. రిమాండ్, బెయిల్, ఇంజక్షన్ తదితర అత్యవసర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ లేదా స్కైప్ ద్వారా విచారణ చేపట్టాలని ఆదేశించింది.

ఈమెయిల్​లో పిటిషన్లు

అత్యవసర పిటిషన్లను న్యాయవాదులు ఈమెయిల్ ద్వారా దాఖలు చేయాలని పేర్కొంది. ఈ వివరాలను వెబ్ సైట్లలో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈనెల 20న లేదా ఆ తర్వాత గడువు ముగిసే అన్ని రకాల మధ్యంతర ఉత్తర్వులు జూన్ 7 వరకు అమల్లో ఉంటాయని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.

ఇదీ చూడండి: ఒక్క రోజే పది మందికి కరోనా పాజిటివ్​..జాగ్రత్త సుమా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.