ETV Bharat / city

KTR at World Economic Forum : 'సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో తెలంగాణ పురోగమనం' - తెలంగాణలో సౌరవిద్యుత్ ఉత్పత్తి

KTR at World Economic Forum : ఇంధన అవసరాల కోసం కర్బన ఉద్గారాలపైనే ఆధారపడకుండా.. క్లీన్, గ్రీన్ ఎనర్జీ వైపు ప్రపంచ దేశాలు వేగంగా మరాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనికోసం ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేయాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఊపందుకున్న ప్రస్తుత ఇంధన వనరులు, విద్యుత్​శక్తి నుంచి గ్రీన్ పవర్ దిశగా గ్రీన్ ట్రాన్సిషన్ దిశగా పెట్టుకున్న లక్ష్యాలను అందుకునేందుకు ప్రభుత్వాలు చర్యలు వేగవంతం చేయాలని అన్నారు.

KTR at World Economic Forum
KTR at World Economic Forum
author img

By

Published : Mar 11, 2022, 7:01 AM IST

KTR at World Economic Forum : సౌరవిద్యుత్‌ రంగంలో తెలంగాణ వేగంగా పురోగమిస్తోందని, దేశ భౌగోళిక విస్తీర్ణంలో 3.5 శాతం ఉన్న రాష్ట్రం 4.2 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో 10.30 శాతం ఉత్పత్తి చేస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. మరో ఏడాదిలో రాష్ట్రం సుమారు ఆరు గిగావాట్ల స్థాయికి చేరుతుందన్నారు. గురువారం.. ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం) తొమ్మిదో ప్రాంతీయ కార్యాచరణ బృందం దృశ్యమాధ్యమంలో నిర్వహించిన సదస్సులో ఆయన హైదరాబాద్‌ నుంచి ప్రసంగించారు.

చేయూత ఇవ్వాలి..

KTR About Solar Energy :‘‘ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి సారిస్తున్నారు. లక్ష్యసాధనకు ప్రభుత్వ, ప్రైవేటు రంగం కలిసి పనిచేయాలి. తెలంగాణ కొత్త విధానాలతో కర్బన ఇంధనాలను తగ్గించడంతో పాటు హరితహారం చేపట్టి ఫలితాలను సాధిస్తోంది. డ్రోన్ల ద్వారా విత్తనాలను చల్లుతూ పచ్చదనాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం. సంప్రదాయేతర ఇంధన వనరుల విస్తరణకు ఆవిష్కరణలు, అంకురాలకు చేయూతనివ్వాలి. హరిత పరిష్కారాల కోసం విద్యారంగంలో మార్పులు చేయాలి’’.

- కేటీఆర్, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి

పెట్టుబడులు అవసరం..

KTR About Green Energy : క్లీన్ ఎనర్జీ లక్ష్యాలను పూర్తి చేయాలంటే భారీ ఎత్తున పెట్టుబడులు అవసరమని, ఇందుకు సంబంధించి ప్రభుత్వాలు, పాలసీల నిర్మాణం వాటి అమలు విషయంలో మరింత వేగంగా ముందుకు పోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. గ్రీన్ ట్రాన్సిషన్, క్లీన్ ఎనర్జీ వైపు తెలంగాణ రాష్ట్రం చురుగ్గా ముందుకు పోతున్న విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన సోలార్ పవర్ పాలసీ, ఎలక్ట్రిక్ వెహికల్, ఎలక్ట్రిక్ స్టోరేజ్ సొల్యూషన్స్ పాలసీ రాష్ట్రంలో గ్రీన్ విద్యుత్, గ్రీన్ సొల్యూషన్స్ వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తోందని అన్నారు.

World Economic Forum Conference : ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు అధ్యక్షుడు బోర్గ్‌ బ్రాండె ఈ సదస్సుకు అధ్యక్షత వహించగా, వివిధ దేశాల ప్రతినిధులతోపాటు పలు వాహన, ఇంధన రంగ కంపెనీల అధినేతలు, తెలంగాణ ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ కూడా పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.