కొవిడ్ టీకాను మొదట ప్రజాప్రతినిధులమంతా వేసుకుని ప్రజల్లో నమ్మకం కలిగించాల్సి ఉన్నా... ప్రధాని సూచనను గౌరవించి ఆగినట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ తెలిపారు. టీకాలు సురక్షితమైనవి, వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఎవరూ భయపడొద్దని అన్నారు. హైదరాబాద్ తిలక్‌నగర్‌లో వ్యాక్సినేషన్‌ను జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు.
భారత్‌లోని పరిస్థితులకు అనుగుణంగా టీకా తయారీ జరిగిందని మంత్రి వెల్లడించారు. ప్రజాప్రతినిధులంతా త్వరలోనే టీకా వేయించుకుంటామని తెలిపారు. సురక్షితమైన టీకాలకు రాజధానిగా హైదరాబాద్ నిలిచిందన్న కేటీఆర్... దశలవారిగా అన్ని వర్గాలకు వ్యాక్సిన్ అందుతుందని భరోసానిచ్చారు.
- ఇదీ చూడండి : అధైర్యమొద్దు... అందరికీ టీకా ఇస్తాం: మంత్రి ఈటల