ETV Bharat / city

KTR At Nizam College Convocation: 'ఫోక్స్.. మీరంతా ప్రపంచస్థాయి కంపెనీలకు అధిపతులుగా ఎదగాలి' - నిజాం కాలేజీ స్నాతకోత్సవంలో కేటీఆర్

KTR At Nizam College Convocation: భారతీయులు ప్రపంచ స్థాయి కంపెనీలకు అధిపతులుగా ఉన్నారని.. ప్రపంచ స్థాయి కంపెనీలు సృష్టించే లోటును నేటి యువత తీర్చాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఏడేళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇవాళ ఆనందించే రోజు అని అన్నారు. హైదరాబాద్‌ నిజాం కళాశాలలో స్నాతకోత్సవానికి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.

KTR At Nizam College Convocation
KTR At Nizam College Convocation
author img

By

Published : Mar 9, 2022, 5:18 PM IST

KTR At Nizam College Convocation : ఏడేళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇవాళ ఆనందించే రోజు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూడటం సరికాదని.. ఉద్యోగాలు సృష్టించే స్థాయికి విద్యార్థులు ఎదగాలని సూచించారు. భారతీయులు ప్రపంచ స్థాయి కంపెనీలకు అధిపతులుగా ఉన్నారన్న కేటీఆర్.. ప్రపంచ స్థాయి కంపెనీలుగా భారత దేశ సంస్థలు ఎదగాలని ఆకాంక్షించారు. భారతీయ ఉత్పత్తులు అన్ని దేశాలకు వెళ్లేలా మనం ఎదగాలని పేర్కొన్నారు.

  • Nothing more joyful than keeping a promise to one’s own Alma mater!

    Had promised a hostel to the girl students of Nizam college in my last visit. Will be inaugurating the same today along with Education minister @SabithaindraTRS Garu

    Happy alumni 😊 pic.twitter.com/ZwV1gTsvfA

    — KTR (@KTRTRS) March 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

KTR About Job Notifications : హైదరాబాద్ నిజాం కళాశాల స్నాతకోత్సవానికి హాజరై మంత్రి కేటీఆర్.. కళాశాలలో బాలికల వసతిగృహాన్ని ప్రారంభించారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు పురస్కారాలు ప్రధానం చేశారు. నిజాం కళాశాలలో ఎనిమిదన్నర కోట్ల వ్యయంతో నిర్మించిన బాలికల వసతిగృహాన్ని ప్రారంభించారు. పూర్వ విద్యార్థిగా జ్ఞాపకాలను నెమరవేసుకున్న కేటీఆర్.. గతంలో ప్రిన్సిపాల్‌కు ఇచ్చిన హామీ మేరకు బాలికల హాస్టల్‌ నిర్మించామని తెలిపారు. ఇప్పుడు కాలేజీ అభివృద్ధికి రూ.15 కోట్లు కావాలని అడిగారని.. అది కూడా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. నేటి యువత కెరీర్ పరంగా చాలా సీరియస్​గా ఉందని.. భవిష్యత్​పై ఓ స్పష్టమైన అవగాహన కలిగి ఆ దిశలోనే విద్యార్థి స్థాయి నుంచి కృషి చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్​తో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా అన్నారు.

"ఏడున్నర ఏళ్లుగా చాలా మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు ఉద్యోగాల కోసం. మీరంతా అదృష్టవంతులు. మీరు గ్రాడ్యుయేట్ అవుతున్న రోజే 80వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అవుతోంది. నేను గ్రాడ్యుయేషన్​లో ఉన్నప్పుడు నాకు ఏం చేయాలి.. ఏం కావాలి అనే క్లారిటీ లేదు. కానీ 8వ తరగతి చదువుతున్న నా కూతురికి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నా కొడుక్కి వాళ్ల లైఫ్​లో ఏం కావాలి.. వాళ్లు ఏం చేయాలో ఓ క్లారిటీ ఉంది. ఈ జనరేషన్ పిల్లలకు వారి లైఫ్​ మీద మంచి క్లారిటీ ఉంది. దానికి తగ్గట్టుగానే వాళ్లు కోర్సులు ఎంచుకుంటున్నారు. వాళ్ల కలను సాకారం చేసుకుంటున్నారు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఫలానా పని మీకు చేతకాదు.. మీ వల్ల కాదు.. మీకు సాధ్యం కాదని చెబితే వాళ్లని నమ్మకండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీరు తలచుకుంటే చేయలేనిది ఏం ఉండదని తెలుసుకోండి."

- కేటీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.