అన్నిరకాల విత్తనాలకు రూ.150 కోట్ల రాయితీ రైతాంగానికి ఇస్తున్నామని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. నకిలీ విత్తనాలపై ఏవిధమైన చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. రాష్ట్రంలో కఠినంగా విత్తన చట్టాన్ని అమలు చేస్తున్నామని సభలో మంత్రి స్పష్టం చేశారు. నాణ్యమైన విత్తనాల సరఫరా కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. నకిలీ విత్తనాలపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టామని... ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో రైతులను చైతన్యవంతం చేయాలని కోరారు. విత్తనాభివృద్ధిలో మనం దేశంలోనే తొలి స్థానంలో ఉన్నామని తెలిపారు. 18దేశాలకు ఇక్కడి నుంచి విత్తన సరఫరా జరుగుతోందని ప్రకటించారు.
ఇవీ చూడండి: హస్తంలో రాజుకున్న చిచ్చు