ETV Bharat / city

ఉపాధి కూలీల వినియోగానికి ఆ శాఖల విముఖత - telangana irrigation department news

సాగునీటి రంగానికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. ఈ బడ్జెట్టులోనూ నిధులను అధికంగా కేటాయించింది. అయితే, ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకోవడంలో మాత్రం ఈ శాఖ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఈ శాఖకు సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ కాలువలు, ఫీడర్‌ ఛానెళ్లు చెట్ల పొదలతో నిండిపోయి, మట్టి పేరుకుపోయి అధ్వానంగా మారుతుంటాయి. వాటిని తొలగించి కాలువలను శుభ్రం చేసేందుకు ఉపాధి హామీ కూలీలను వినియోగించుకునే అవకాశముంది.

employment guarantee scheme, telangana news
ఉపాధి హామీ పథకం, ఉపాధి కూలీలు, తెలంగాణ వార్తలు
author img

By

Published : Apr 5, 2021, 7:11 AM IST

కాళేశ్వరంతో పాటు దేవాదుల తదితర ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో చెరువులను నింపుతున్నందున కొత్తగా చెరువుల నుంచి పంట కాలువలను కూడా ఉపాధి కూలీలతో తవ్వించే అవకాశం ఉన్నా.. నీటిపారుదల శాఖ పెద్దగా దృష్టి సారించడం లేదు. రహదారులు భవనాల(ఆర్‌అండ్‌బీ) శాఖ కూడా ఉపాధి కూలీలను వాడుకోవడంలో విముఖత చూపుతోంది. ఉపాధి హామీ పథకంలో ‘కన్వర్జెంట్‌’ కింద కూలీలను ఇతర శాఖలకు కేటాయించే అవకాశముంది. సంబంధిత శాఖలు తమ పరిధిలో చేపట్టాల్సిన పనులను గుర్తించి ఆ జాబితాను ఎంపీడీవోలకు ఇవ్వాల్సి ఉంటుంది. వారు పరిశీలించి అవసరమైన కూలీలను కేటాయిస్తారు. సాగునీరు, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు మాత్రం పనుల గుర్తింపును పట్టించుకోవడం లేదు. కొన్ని జిల్లాల్లో ఆయా శాఖలు ఒక్క పనిని కూడా గుర్తించకపోవడం గమనార్హం.

సాగునీటి శాఖ :

కరీంనగర్‌, ములుగు, నిర్మల్‌, పెద్దపల్లి జిల్లాల్లో ఈ శాఖ ఒక్క పనినీ గుర్తించలేదు. ఖమ్మం, భూపాలపల్లి, ఆదిలాబాద్‌, రాజన్నసిరిసిల్ల, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ తదితర జిల్లాల్లో అధికారులు రెండు, మూడు పనులను మాత్రమే గుర్తించారు. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 339 పనులను గుర్తించారు. ఈ శాఖ ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి కేవలం 1,414 పనులను మాత్రమే గుర్తించింది.

ఆర్ ‌అండ్‌ బీ శాఖ :

రహదారులు భవనాల శాఖ అధికారులు 20 జిల్లాల్లో ఒక్క పనిని కూడా గుర్తించలేదు. ఈ శాఖ పరిధిలోని రహదారుల వెంట ఉన్న పిచ్చి మొక్కలను ఉపాధి హామీ కూలీలతో తొలగించుకోవచ్చు. రహదారికి రెండు వైపులా చదును చేసి మొక్కలను కూడా నాటించే అవకాశం ఉంది. అయినా.. ఈ శాఖ అధికారులు కూలీలను వాడుకోవడంలో నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు.

సామాజిక తనిఖీలకు భయపడే?

ఉపాధి హామీ పథకం కింద పూర్తయిన పనులపై గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సామాజిక తనిఖీలు నిర్వహించి అవకతవకలను వెలికితీస్తారు. అక్రమాలు సామాజిక తనిఖీల ద్వారా బయటకు వస్తాయనే భయంతోనే ఈ రెండు శాఖల అధికారులు ఉపాధి పనులు, నిధుల వినియోగానికి వెనుకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో కన్వర్జెంట్‌ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నా.. పెద్దగా ఫలితం ఉండడం లేదు. పనులు గుర్తించాలని, వాటిని నమోదు చేసేందుకు లాగిన్‌ చెప్పాలని తాము ఇంజినీరింగ్‌ అధికారులకు సూచిస్తున్నా.. స్పందించడంలేదని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.