ETV Bharat / city

Engineering counseling: ఇంజినీరింగ్​ తొలివిడత కౌన్సెలింగ్​లో వచ్చిన సీటు రద్దు చేసుకోవచ్చు.. కానీ.. - engineering counseling news

ఇంజినీరింగ్​ తొలి విడత కౌన్సెలింగ్​లో వచ్చిన సీటును రద్దుచేసుకొనే గడువును మరోసారి పొడిగించింది.. రాష్ట్ర ఉన్నత విద్యామండలి. తుది విడత కౌన్సెలింగ్​ ముందురోజు వరకు రద్దు చేసుకోవచ్చని తెలిపింది. కానీ తుది విడత కౌన్సెలింగ్​ ప్రారంభమయ్యాక రద్దు చేసుకొంటే సగం ఫీజు మాత్రమే తిరిగి చెల్లిస్తారని తెలిపింది.

engineering seat allotment in telangana
engineering seat allotment in telangana
author img

By

Published : Oct 13, 2021, 11:00 PM IST

ఇంజినీరింగ్ మొదటి విడత కౌన్సెలింగ్​లో వచ్చిన సీటును రద్దు చేసుకొనే గడువును మరోసారి పొడిగించారు. ఈనెల 20 లేదా తుది విడత కౌన్సెలింగ్ ముందు రోజు వరకు రద్దు చేసుకోవచ్చునని ప్రవేశాల కమిటీ వెల్లడించింది. ఈనెల 21 నుంచి తుది విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది.

ఇంజినీరింగ్​లో 48 కోర్సుల్లో కన్వీనర్ కోటాలో 78,270 సీట్లు ఉండగా.. మొదటి విడత కౌన్సెలింగ్​లో 61,169 మందికి సీట్లు కేటాయించారు. వారిలో 46,322 మంది మాత్రమే సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. సీటు రద్దు చేసుకుంటే విద్యార్థి చెల్లించిన బోధన రుసుము పూర్తిగా చెల్లిస్తారు. తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభమయ్యాక రద్దు చేసుకుంటే సగం ఫీజు మాత్రమే తిరిగి ఇస్తారు.

రాష్ట్రంలో ఇంజినీరింగ్ మొదటి విడతలో 60,169 సీట్లు భర్తీ అయ్యాయి. మరో 13,130 సీట్లు మిగిలాయి. రాష్ట్రవ్యాప్తంగా 175 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 74,071 ఇంజినీరింగ్ సీట్లు ఉండగా.. వాటిలో 60,169 తొలివిడతలో కేటాయించారు. ఈ ఏడాది అందుబాటులోకి వచ్చిన ఈడబ్ల్యూఎస్ కోటాలో 5,108 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి.

ఇదీచూడండి: EAMCET Counselling: ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లు కేటాయింపు.. 82.24 శాతం భర్తీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.