రాష్ట్రంలో కోర్టుల అన్ లాక్‌లో భాగంగా అక్టోబరు 2 వరకు అనుసరించాల్సిన విధానాలను హైకోర్టు ప్రకటించింది. కొన్ని రోజులుగా కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, పాక్షికంగా రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో కోర్టులను ప్రయోగాత్మకంగా తెరిచి భౌతికంగా కేసుల విచారణ నిర్వహిస్తున్నారు. అక్టోబరు 2 వరకు అదే విధానాన్ని కొనసాగించాలని హైకోర్టు నిర్ణయించింది.
కొత్తగా ఆదిలాబాద్, ఖమ్మంతో పాటు.. సంగారెడ్డి పట్టణం మినహా మెదక్ ఉమ్మడి జిల్లాల్లో న్యాయస్థానాలను కరోనా నివారణ జాగ్రత్తలతో ప్రయోగాత్మకంగా తెరవాలని హైకోర్టు నిర్ణయించింది. హైదరాబాద్‌లోని సీబీఐ, నాంపల్లి, సిటీ సివిల్ కోర్టుల్లో విచారణ భౌతికంగా జరపాలా లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కొనసాగించాలా అనే విషయాన్ని పరిపాలన న్యాయమూర్తులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.
హైకోర్టులో ప్రస్తుతం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. న్యాయవాదులు కోరితే మధ్యాహ్నం భౌతికంగా విచారణ నిర్వహిస్తున్నారు. అక్టోబరు 2 వరకు హైకోర్టులో ప్రస్తుత విధానమే కొనసాగించనున్నట్లు ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.
ఇదీ చదవండి : అవని తల్లి ఒడికి గాన గాంధర్వుడు ఎస్పీ బాలు