ETV Bharat / city

బయటకు రావడానికే జనం భయపడుతుంటే..ఎగ్జిబిషన్ కావాలా?: హైకోర్టు

telangana high court
telangana high court
author img

By

Published : Jan 4, 2022, 2:41 PM IST

Updated : Jan 4, 2022, 3:30 PM IST

14:38 January 04

బయటకు రావడానికే జనం భయపడుతుంటే..ఎగ్జిబిషన్ కావాలా?: హైకోర్టు

High court on Numaish exhibition : 2019 నుమాయిష్​ ఎగ్జిబిషన్‌లో అగ్నిప్రమాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. నాటి ఘటనను దృష్టిలో ఉంచుకొని.. ఎగ్జిబిషన్​ నిర్వహణకు ఫైర్, జీహెచ్ఎంసీ అనుమతి తీసుకోవాలని జీవో ఇచ్చామని ప్రభుత్వం తరఫు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ వివరణతో సంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం.. 2019 అగ్నిప్రమాదంపై విచారణ ముగిస్తున్నట్లు వెల్లడించింది. వివిధ విభాగాల అనుమతి తీసుకోవాలన్న ఉత్తర్వులు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ సందర్భంగా ప్రస్తుతం జరుగుతున్న ఎగ్జిబిషన్‌ నిలిపివేయడంపై ఎగ్జిబిషన్ సొసైటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎగ్జిబిషన్ నిలిపివేయడం సమంజసం కాదని సొసైటీ తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. థియేటర్లు, మాల్స్‌కు లేని ఆంక్షలు.. ఎగ్జిబిషన్‌కు ఎలా విధిస్తారంటూ వాదించారు. దీనిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా, ఒమిక్రాన్​ వంటి ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు రావడానికే జనం భయపడుతుంటే.. ఎగ్జిబిషన్ కావాలా? అంటూ సూటిగా ప్రశ్నించింది. ఎగ్జిబిషన్ నిర్వహణపై సర్కారు నిర్ణయం తీసుకోగలదని అభిప్రాయం వ్యక్తం చేసింది. కొవిడ్ పరిస్థితిలో ఎగ్జిబిషన్ ఉంచాలా, లేదా అనేది ప్రభుత్వ నిర్ణయమని స్పష్టం చేసింది.

ఇదీచూడండి: Telangana High Court on Corona: కొవిడ్ పరిస్థితిపై హైకోర్టుకు నివేదిక సమర్పించిన డీహెచ్, డీజీపీ

Last Updated : Jan 4, 2022, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.