ETV Bharat / city

'భూ వివాదాలు తేల్చే పరిధి హక్కుల కమిషన్‌కు లేదు' - భూవివాదాలపై తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలు

Telangana High Court on Land Disputes : భూములపై హక్కులను నిర్ణయించే పరిధి హక్కుల కమిషన్‌కు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం గ్రామంలో సుమారు రూ.2 వేల కోట్ల విలువైన భూముల హక్కులను నిర్ణయిస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఉత్తర్వులివ్వడంపై బుధవారం హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. హక్కులను తేల్చడంలో కమిషన్‌ అనుసరించిన పద్ధతి సరిగా లేదని పేర్కొంది.

Telangana High Court on Land Disputes
Telangana High Court on Land Disputes
author img

By

Published : Feb 3, 2022, 8:59 AM IST

Updated : Feb 3, 2022, 1:59 PM IST

Telangana High Court on Land Disputes : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం గ్రామంలో సుమారు రూ.2 వేల కోట్ల విలువైన భూముల హక్కులను నిర్ణయిస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఉత్తర్వులివ్వడంపై బుధవారం హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భూములపై హక్కులను తేల్చే పరిధి కమిషన్‌కు ఎక్కడుందని ప్రశ్నించింది. ఇలాగైతే జిల్లా జడ్జిలకు భారంగా ఉన్న కేసులన్నిటినీ కమిషన్‌ తేల్చవచ్చుగా అంటూ వ్యాఖ్యానించింది.

Telangana High Court Comments on HRC : భూములపై హక్కులను నిర్ణయించే పరిధి హక్కుల కమిషన్‌కు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. రాయదుర్గంలో సర్వే నెం.46లోని 84.30 ఎకరాల భూములను లార్వెన్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌, సయ్యద్‌ రహీముల్లా హుస్సేనికి అప్పగించాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ)ను ఆదేశిస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ 2020లో ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భూములపై వివాదాలుంటే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రెండో అప్పీలులో గానీ, సివిల్‌ కోర్టులో గానీ తేల్చుకోవాలని స్పష్టం చేసింది. రాయదుర్గం భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వంతో పాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలను విన్నాక, హక్కుల కమిషన్‌ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. హక్కులను తేల్చడంలో కమిషన్‌ అనుసరించిన పద్ధతి సరిగా లేదని పేర్కొంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Feb 3, 2022, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.