ETV Bharat / city

ఇక పొక్సో కేసుల దర్యాప్తు మరింత ముమ్మరంగా.. - telangana govt getting strong to impliment pocso act

చిన్నారులపై జరిగే లైంగిక దాడుల కేసు(పొక్సో)ల్లో పోలీసుల దర్యాప్తును పటిష్ఠం పరిచేందుకు తెలంగాణ మహిళా, చిన్నారుల భద్రత విభాగం నడుం బిగించింది. రాష్ట్రవ్యాప్తంగా నమోదయ్యే కేసుల్ని రాజధాని నుంచే పర్యవేక్షిస్తూ.. అవసరమైన సహకారం అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్(సీసీటీఎన్ఎస్) డేటాను ఆధారంగా తీసుకోనున్నారు.

ఇక పొక్సో కేసుల దర్యాప్తు మరింత ముమ్మరంగా..
ఇక పొక్సో కేసుల దర్యాప్తు మరింత ముమ్మరంగా..
author img

By

Published : Nov 27, 2019, 5:05 AM IST

Updated : Nov 27, 2019, 10:00 AM IST

పొక్సో చట్టాన్ని పటిష్ఠం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రవ్వాప్తంగా నమోదయ్యే కేసులను హైదరాబాద్‌ నుంచే పర్యవేక్షణ, సహకారం అందించాలని నిర్ణయించింది. రాజధానిలో మహిళా భద్రత విభాగం సిబ్బంది క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్ డేటాను పరిశీలిస్తూ పోక్సో కేసుల గురించి ఆరా తీస్తారు. కేసు తీవ్రతను అనుసరించి దర్యాప్తు అధికారులకు తగు సూచనలు చేస్తారు. మహిళా భద్రత విభాగంలోని నిపుణులు వీరికి సహకరిస్తారు. ఈమేరకు మహిళా భద్రత విభాగం ఐజీ స్వాతిలక్రా అవసరమైన కార్యాచరణ రూపొందించారు.

న్యాయస్థానంలో కేసులు వీగిపోకూడదు...

పొక్సో కేసుల్లో శిక్షల శాతం పెంచడమే లక్ష్యంగా ఈ కసరత్తును ప్రారంభించినట్లు స్వాతిలక్రా తెలిపారు. చిన్నారులపై లైంగిక దాడుల విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఈ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఎంత సంచలనం సృష్టించిన కేసైనా దర్యాప్తు సరిగ్గా లేకపోతే న్యాయస్థానంలో వీగిపోయే అవకాశముంటుంది. అందుకే దర్యాప్తు అధికారులకు అవసరమైన మెలకువల్ని అందించాలని స్వాతిలక్రా నిర్ణయించారు.

కరీంనగర్‌లో మొదటి శిక్షణ తరగతులు...

ఈ క్రమంలో పోలీస్ యూనిట్ల వారీగా ఈ సదస్సులు నిర్వహించనున్నారు. తొలుత కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని దర్యాప్తు అధికారులకు డిసెంబర్ 7న కరీంనగర్‌లోనే శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం వీలును బట్టి మిగిలిన యూనిట్లలోనూ ఈ సదస్సులు జరపనున్నారు. వరంగల్‌లో ఇటీవలికాలంలో సంచలనం రేపిన 9నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనలో నెలన్నర రోజుల్లోనే నిందితుడికి శిక్ష వేయించేలా దర్యాప్తు చేయడాన్ని శిక్షణ సందర్భంగా ఉటంకించనున్నారు. ఆ కేసుతోపాటు అలాంటి కేసుల్లో దర్యాప్తు చేసిన తీరును వివరించనున్నారు. అలాగే కేసుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించేందుకు చట్టపరంగా చేపట్టాల్సిన చర్యల గురించి అవగాహన కల్పిస్తారు.

ఇవీచూడండి: టీ హబ్​లో ఎన్​​పీసీఐ ఇన్నోవేషన్​ ల్యాబ్​ ప్రారంభం

TG_HYD_11_27_POKSO_SPEEDUP_PKG_3181965 REPORTER : PRAVEEN KUMAR ( ) చిన్నారులపై జరిగే లైంగిక దాడుల కేసు ( పొక్సో ) ల్లో పోలీసుల దర్యాప్తును పటిష్ఠం పరిచేందుకు తెలంగాణ మహిళా, చిన్నారుల భద్రత విభాగం నడుం బిగించింది. రాష్ట్రవ్యాప్తంగా రాణాల్లో నమోద య్యే కేసుల్ని రాజధాని నుంచే పర్యవేక్షిస్తూ దర్యాప్తునకు అవసరమైన సహకారం అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్ సిన మ్ ( సీసీటీఎన్ఎస్ ) డేటాను ఆధారంగా తీసుకోనున్నారు . హైదరాబాద్లోని మహిళా భద్రత విభాగం సిబ్బంది నిత్యం ఆ డేటాను పరిశీలిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నమోదయ్యే పోక్సో కేసుల గురించి ఆరా తీస్తారు. LOOK V.O : కేసు తీవ్రతను అనుసరించి దర్యాప్తు అధికారులకు తగు సూచనలు చేస్తారు . మహిళా భద్రత విభాగంలోని నిపుణులు ఇందకు సహకరిస్తారు. ఈమేరకు మహిళా భద్రత విభాగం ఐజీ స్వాతిలక్రా అవసరమైన కార్యాచరణ రూపొందించారు. పోక్సో కేసుల్లో శిక్షల శాతం పెంచడమే లక్ష్యంగా ఈ కసరత్తును ఆరంభించారు. చిన్నారులపై లైంగిక దాడుల విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఈ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు . ఎంత సంచలనం సృష్టించిన కేసైనా దర్యాప్తు సరిగ్గా లేకపోతే న్యాయస్థానంలో వీగిపోయే అవకాశముంటుంది. అందుకే దర్యాప్తు అధికారులకు అవసరమైన మెలకువల్ని అందించాలని స్వాతిలక్రా నిర్ణయించారు. పోక్సో కేసుల్లో ఘటన అనంతరం కేసు నమోదు నుంచి మొదలుకొని , సీడీ ఫైల్ రూపొందించడం , సాక్ష్యాధారాల్ని సేకరించడం , అభియోపగపత్రాల్ని రూపొందించడం , న్యాయస్థానంలో ట్రయల్స్ సందర్భంగా పకడ్బందీగా సాక్ష్యాల్ని ఇప్పించడం వరకు ఎలా వ్యవహరించాలనే విషయంపై నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు . అయితే గతంలో మాదిరిగా దర్యాప్తు అధికారులను రాజధానికి పిలిపించడంకంటే ఆయా యూనిట్లలోనే శిక్షణ ఇవ్వడం అన్ని విధాలా మంచిదనే అభిప్రాయానికి వచ్చారు. V.O : ఈ క్రమంలో పోలీస్ యూనిట్ల వారీగా ఈ సదస్సులు నిర్వహించనున్నారు. తొలుత కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని దర్యాప్తు అధికారులకు ఈనెల 7న కరీంనగర్లోనే శిక్షణ ఇవ్వనున్నారు . అనంతరం వీలును బట్టి మిగిలిన యూనిట్లలోనూ ఈ సదస్సులు జరపనున్నారు . వరంగల్ లో ఇటీవలికాలంలో ని సంచలనం రేపిన 9నెలల చిన్నారిపై అత్యాచారం , హత్య ఘటనలో నెలన్నర రోజుల్లోనే నిందితుడికి శిక్ష వేయించేలా దర్యాప్తు చేయడాన్ని శిక్షణ సందర్భంగా ఊటంకించనున్నారు . ఆ కేసుతోపాటు అలాంటి కేసుల్లో దర్యాప్తు చేసిన తీరును వివరించనున్నారు . అలాగే కేసుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించేందుకు చట్టపరంగా చేపట్టాల్సిన చర్యల గురించి అవగాహన కల్పిస్తారు . చాలా వరకు కేసుల్లో నిందితుడికి బెయిల్ రానీయకుండా చేసి జైల్లో ఉండగానే విచారణ ముగించేందుకు చేయాల్సిన కసరత్తు పై చర్చించనున్నారు . E.V.O : చిన్నారులపై లైంగిక దాడుల కేసుల్లో సాగాల్సిన దర్యాప్తులో ఎస్సైలు , సీఐలే కీలకం కి బట్టి వారికి శిక్షణ ఇస్తామని.. దర్యాప్తు అధికారులందరిని హైదరాబాద్ కు పిలిపించి శిక్షణ ఇవ్వడం వ్యయప్రయాని లతో కూడుకున్నది కావడంతో జిల్లాల్లోనే నిర్వహించాలని నిర్ణయించామని స్వాతిలక్రా పేర్కొన్నారు.
Last Updated : Nov 27, 2019, 10:00 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.