ప్రాణాంతక కరోనా మహమ్మారిని నుంచి రక్షణ పొందేందుకు తీసుకుంటున్న కొవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ వంద కోట్ల(India's 100 crore vaccination milestone)కు చేరడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Telangana Governor Tamilisai soundararajan) అన్నారు. భారతదేశ చరిత్రలో ఈరోజు ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ఈ మైలురాయిని చేరుకోవడంలో కీలక పాత్ర వహించిన ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. వందకోట్ల టీకాల పంపిణీ పూర్తైన సందర్భంగా హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రికి గవర్నర్ వెళ్లారు. కొవిడ్ టీకా పంపిణీలో ప్రధాన పాత్ర వహించిన ఈఎస్ఐ వైద్యులను తమిళిసై(Telangana Governor Tamilisai soundararajan) సన్మానించారు.
-
India crosses historic 100 crore
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) October 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Covid vaccination milestone today.
Congratulations to healthcare workers, Scientists & frontline warriors of India.
My sincere thanks to Honb @PMOIndia for leading the nation towards this remarkable achievement.#vaccination#VaccineCentury pic.twitter.com/Dl9p7aBSSu
">India crosses historic 100 crore
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) October 21, 2021
Covid vaccination milestone today.
Congratulations to healthcare workers, Scientists & frontline warriors of India.
My sincere thanks to Honb @PMOIndia for leading the nation towards this remarkable achievement.#vaccination#VaccineCentury pic.twitter.com/Dl9p7aBSSuIndia crosses historic 100 crore
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) October 21, 2021
Covid vaccination milestone today.
Congratulations to healthcare workers, Scientists & frontline warriors of India.
My sincere thanks to Honb @PMOIndia for leading the nation towards this remarkable achievement.#vaccination#VaccineCentury pic.twitter.com/Dl9p7aBSSu
దేశంలో ఉత్పత్తి చేసిన టీకానే తీసుకున్నందుకు ఎంతో గర్వంగా ఉందని గవర్నర్(Telangana Governor Tamilisai soundararajan) హర్షం వ్యక్తం చేశారు. 100 కోట్ల టీకా పంపిణీయే కాకుండా.. 100ల దేశాలకు భారత్‌లో ఉత్పత్తి చేసిన టీకాను ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. అపోహ వీడి అందరూ టీకా తీసుకోవాలని సూచించారు. ఐసీయూలో చేరినవారిలో ఎక్కువ మంది టీకా తీసుకోని వారేనని.. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే.. మహమ్మారి నుంచి రక్షణ పొందవచ్చని చెప్పారు.
"జనవరి 16 నుంచి కరోనా టీకా పంపిణీ ప్రారంభించాము. అక్టోబర్ 21కి వంద కోట్ల పంపిణీ పూర్తి చేశాం. ఈ ప్రక్రియ ప్రారంభంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. చాలా దేశాలు మనల్ని అనుమానించాయి. కానీ.. చివరకు మన టీకాలనే ఆ దేశాలు దిగుమతి చేసుకున్నాయి. భారత్‌లో వంద కోట్ల మంది టీకాలు తీసుకోవడమే కాదు.. మన వ్యాక్సిన్లను 100 దేశాలు తీసుకున్నాయి. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో... అన్ని రాష్ట్రాల వైద్య శాఖలు, వైద్యులు, సిబ్బంది కృషితో ఈ మైలురాయి చేరుకున్నాం. ఇంకా టీకా తీసుకోవడానికి వెనుకడుగువేస్తున్న వాళ్లంతా.. వంద కోట్ల మంది వ్యాక్సిన్ వేసుకుని ఆరోగ్యంగా ఉన్నారనే విషయాన్ని గమనించాలి. ఇప్పటికైనా అపోహ వీడి టీకా తీసుకోవాలి."
- తమిళిసై సౌందరరాజన్, తెలంగాణ గవర్నర్
మొదట వైద్యులు, వైద్య సిబ్బందికి టీకా ఇచ్చామని గవర్నర్(Telangana Governor Tamilisai soundararajan) తెలిపారు. తర్వాత ఫ్రంట్ లైన్ వారియర్స్, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, 40 ఏళ్ల పైబడిన వారు, అనంతరం 18 ఏళ్లు నిండిన వారికి టీకా పంపిణీ చేశామని వెల్లడించారు. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. చిన్నపిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్న తొలి దేశంగా భారత్ ఘనత సాధించనుందని తమిళిసై(Telangana Governor Tamilisai soundararajan) అన్నారు.
- ఇదీ చదవండి : ఈ ఘనత ప్రతి ఒక్క భారతీయుడి సొంతం: మోదీ