రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో జలుబు, దగ్గు, జ్వరానికి మందులు కొనుగోలు చేసేవారి వివరాలను సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. వారందరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది.
మెడికల్ దుకాణాల నిర్వాహకులు, ఫార్మసిస్ట్ అసోసియేషన్లతో సమావేశం నిర్వహించాలని కోరుతూ ప్రభుత్వం మెమో జారీచేసింది. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషర్లతోపాటు ఆయాజిల్లాలో అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు బాధ్యతను అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది.
కరోనా లక్షణాలు ఉన్నవారికి మందులు అందించే ముందు వారి వివరాలను తప్పక సేకరించాలని కోరింది. ఆ వివరాలతో ఆయా ప్రాంతాల్లోని వారికి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది.
ఇవీచూడండి: కరోనాపై సీఎం కేసీఆర్ సమీక్ష.. లాక్డౌన్పై కీలక చర్చ