ETV Bharat / city

Telangana Loan : రూ.50 వేల కోట్లు దాటనున్న రుణం - తెలంగాణ రుణాలు 2022-23

Telangana Loan : రాష్ట్ర సర్కార్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరోసారి బాండ్లను విక్రయించడం ద్వారా రూ.1029 కోట్ల రుణాన్ని తీసుకోనుంది. దీంతో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.50వేలకు పైగా కోట్లను బడ్జెట్ పరిధిలో తీసుకున్నట్లవుతుంది. మరో మూడు రోజుల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరంలో రూ.45,509 కోట్ల మార్కెట్‌ రుణాలను సమకూర్చుకోవడం లక్ష్యంగా ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది.

Telangana Loan
Telangana Loan
author img

By

Published : Mar 28, 2022, 10:05 AM IST

Telangana Loan 2022 : రాష్ట్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.49,365 కోట్ల రుణాలను సమీకరించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరిసారిగా మంగళవారం మరోసారి బాండ్లను విక్రయించడం ద్వారా రూ.1,029 కోట్ల రుణాన్ని తీసుకోనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.50,394 కోట్లను బడ్జెట్‌ పరిధిలో రుణాలను తీసుకున్నట్లవుతుంది.

మరో మూడు రోజుల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరంలో రూ.45,509 కోట్ల మార్కెట్‌ రుణాలను సమకూర్చుకోవడం లక్ష్యంగా ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది. రుణ సమీకరణ అంచనాలను రూ.47,500 కోట్లకు సవరించింది. దీంతోపాటు బడ్జెట్‌ పరిధిలో ఇతర రుణాలను రూ.1,700 కోట్లు ప్రతిపాదించారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల సడలింపు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల విక్రయం ద్వారా బహిరంగ మార్కెట్‌లో రుణాలు తీసుకునే మొత్తం పెరిగింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 2020-21 ఆర్థిక సంవత్సరంలో రుణాల మొత్తం 25.17 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ శాతాన్ని 24.69గా అంచనా వేయగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రుణాల మొత్తాన్ని 25.29 శాతంగా ప్రభుత్వం అంచనా వేసింది.

తక్కువ వడ్డీతో పాటు దీర్ఘకాలంలో తిరిగి చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌ రుణాలను తీసుకుంటున్నట్లు బడ్జెట్‌ సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది. దీంతో పాటు 2036వ సంవత్సరం తర్వాతే తెలంగాణ రాష్ట్రం 49 శాతం రుణాలు చెల్లింపు చేయాల్సి ఉంటుందని ఆర్‌బీఐ అధ్యయనంలో వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ రుణాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి బడ్జెట్‌ పరిధిలోనివి రూ.2,85,116 కోట్లు. ఇవి కాక రాష్ట్రం బడ్జెట్‌ వెలుపల వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం తీసుకున్న రుణాలకు ఇచ్చిన గ్యారెంటీల మొత్తం ఈ ఏడాది జనవరి ఆఖరు నాటికి రూ.1,35,282 కోట్లు.

.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.