ETV Bharat / city

జనవరిలోనే పదోన్నతులు, వేతన సవరణ: సీఎం కేసీఆర్

kcr
kcr
author img

By

Published : Dec 31, 2020, 2:54 PM IST

Updated : Dec 31, 2020, 5:38 PM IST

14:51 December 31

జనవరి మూడో వారంలో వేతన సవరణ : కేసీఆర్​

వేతన సవరణ, పదవీ విరమణ వయసు పెంపు సహా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నింటినీ జనవరి నెలాఖరులోగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. వివిధ ఉద్యోగ సంఘాల నేతలు, ప్రతినిధులు ప్రగతిభవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​ను కలిశారు. ఆయా సంఘాల నూతన సంవత్సర డైరీ, కేలండర్లను సీఎం ఆవిష్కరించారు. ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి భోజనం చేసిన ముఖ్యమంత్రి... వారి సమస్యలను విని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  

వారంలో సొంత రాష్ట్రానికి

వేతనసవరణ సంఘం నివేదికపై జనవరి 6, 7 తేదీల్లో ఉద్యోగ సంఘాలతో చర్చించాలని సీఎస్ నేతృత్వంలోని కమిటీకి సూచించారు. జనవరి మూడో వారంలో వేతన సవరణతో పాటు పదవీ విరమణ వయసు పెంపును ప్రభుత్వం ప్రకటించనుంది. జనవరి నెలాఖరులోపు పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులందరినీ వారం రోజుల్లోపు సొంత రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.  

అందులోనే సర్దుబాటు

త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. వీఆర్వోలను వీలైనంత వరకు రెవెన్యూశాఖలోనే సర్దుబాటు చేస్తామని సీఎం తెలిపారు. అవసరాన్ని బట్టి వీఆర్వోల ఇష్ట ప్రకారం ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తామని చెప్పారు.  

ఇదీ చదవండి: సాగుభూముల సందిగ్ధతలకు రెండు నెలల్లో పరిష్కారం: సీఎం

Last Updated : Dec 31, 2020, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.