ETV Bharat / city

రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు వాయిదా - telangana entrance exams updates

all entrance exams postpone in telangana
రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు వాయిదా
author img

By

Published : Jun 30, 2020, 2:40 PM IST

Updated : Jun 30, 2020, 5:44 PM IST

14:38 June 30

రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు వాయిదా

 రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.  పరీక్షల తేదీలను తర్వాత వెల్లడిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. జులై 4, 11, 12న జరగాల్సిన టైప్ రైటింగ్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు కోర్టుకు నివేదించింది.  

        ఇంజినీరింగ్ చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించే ఆలోచన లేదని జేఎన్టీయూహెచ్ తెలిపింది. చివరి 2 సెమిస్టర్ల మార్కుల సరాసరితో గ్రేడింగ్ ఇవ్వాలని సిఫారసు చేశామంది. ఉన్నత విద్యామండలి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. యూజీ, పీజీ పరీక్షలపై ఈనెల 9లోగా స్పష్టత ఇవ్వాలని ఉన్నత విద్యామండలి, జేఎన్టీయూహెచ్‌కు హైకోర్టు ఆదేశించింది.  

          ప్రవేశ పరీక్షలతో పాటు టైప్ రైటింగ్ వాయిదా వేయాలని కోరుతూ ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్​ఎస్​ చౌహాన్, జస్టిస్ విజయ్​సేన్ రెడ్డి ధర్మాసనం.. హైదరాబాద్​లో మళ్లీ లాక్​డౌన్ విధించే అవకాశాలపై వివరణ ఇవ్వాలని ఏజీని ఆదేశించింది. ఒకవేళ హైదరాబాద్​లో లాక్​డౌన్ విధిస్తే ప్రవేశ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది.  

     ప్రవేశ పరీక్షల వాయిదాపై సంబంధిత అధికారులతో సీఎస్​ చర్చించి నిర్ణయం తీసుకుంటారని ధర్మాసనానికి ఏజీ తెలిపారు. మధ్యాహ్నం రెండున్నర వరకు సమయం ఇవ్వాలని కోరారు. అంగీకరించిన హైకోర్టు.. విచారణను మధ్యాహ్నం రెండున్నరకు వాయిదా వేసింది.

      సంబంధిత అధికారులతో చర్చించిన ప్రభుత్వం.. రాష్ట్రంలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు తన నిర్ణయాన్ని హైకోర్టుకు నివేదించింది.

ఇవీచూడండి: ప్రవేశ పరీక్షల వాయిదా పిల్‌పై హైకోర్టులో విచారణ

Last Updated : Jun 30, 2020, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.