ETV Bharat / city

సరికొత్త చట్టంతో ఏకమొత్తంగా దుర్విచక్షణాధికారాలకు కోత - రిజిస్ట్రేషన్‌ మ్యుటేషన్‌

‘సాధించుకున్న తెలంగాణను సవరించుకొందాం... సాదుకొందాం’ అంటూ ముఖ్యమంత్రిగా నవ నిర్మాణ దీక్ష ప్రారంభించిన నాడే ప్రకటించిన కేసీఆర్‌ ప్రభుత్వం- సరికొత్త రెవిన్యూ చట్టానికి పట్టాభిషేకం చేస్తోంది. ప్రతి ముప్ఫయ్యేళ్లకోసారి సమగ్ర సర్వే ద్వారా భూరికార్డుల ప్రక్షాళన జరగాలన్న నిర్దేశాలకు ఏ దశలోనూ ఎక్కడా మన్నన దక్కకపోబట్టే భూముల చుట్టూ వివాదాలే కాదు, పెను కుంభకోణాలూ పరిభ్రమిస్తున్నాయి.

సరికొత్త చట్టంతో ఏకమొత్తంగా దుర్విచక్షణాధికారాలకు కోత

author img

By

Published : Sep 11, 2020, 7:21 AM IST

ఖజానాకు అత్యధిక రాబడి వనరైన స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ తీరు మేడిపండు చందమని, భూముల రేట్లకు రెక్కలు మొలిచేకొద్దీ అవినీతి విశృంఖలత్వానికి పట్టపగ్గాల్లేకుండా పోతున్నాయని రూఢమయ్యాక కేసీఆర్‌ సర్కారు సరికొత్త చట్టంతో ఏకమొత్తంగా దుర్విచక్షణాధికారాలకు కొరత వేసింది. 22 రకాల భూములు, వందకుపైగా చట్టాలతో కీకారణ్యాన్ని తలపించే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాంతం అవినీతి పంకిలమై పోగా, ఆధునిక సాంకేతికత దన్నుతో ఆపన్నులకు అండగా నిలవనున్న చట్టం- సరళతర పారదర్శక లావాదేవీలను జన సామాన్యానికి అందుబాటులోకి తీసుకురానుంది. ప్రభుత్వ భూములన్నింటినీ ‘ఆటోలాక్‌’ పరిధిలోకి తెచ్చి కబ్జాసురులకు కళ్ళెం వెయ్యడం, దస్త్రాలను మార్చి సర్కారు ఆస్తులను అప్పనంగా దోచిపెట్టే అధికారుల బర్తరఫ్‌ వంటివి అవినీతి రాజాల ఆట కట్టించేవే.

ప్రజలకెంతో సాంత్వన..

రిజిస్ట్రేషన్‌ మ్యుటేషన్‌ ఒక్కరోజులోనే పూర్తికావడం- ప్రజలకెంతో సాంత్వన కలిగించేదే. రెవిన్యూ విభాగానికి ఆయువుపట్టుగా ధరణి పోర్టల్‌ను తీర్చిదిద్దుతామని, రెవిన్యూ కోర్టుల్లో ప్రస్తుతం అపరిష్కృతంగా ఉన్న కేసుల కోసం తాత్కాలిక ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. సమగ్ర సమాచార నిధిగా ధరణి పోర్టల్‌ అక్కరకు రావాలంటే- భూరికార్డుల ప్రక్షాళన, అందుకు వీలు కల్పించేలా భూముల సర్వే నిష్ఠగా సాగాలి. భూవివాద పరిష్కారాల్ని సామాన్యులకు చేరువ చేసిన బిహార్‌ ట్రైబ్యునల్‌ నమూనానూ అవశ్యం పరిశీలించాలి!

మెరుగైన భూపరిపాలన..

గ్రామీణ ప్రాంత భూముల్లో రెండు శాతం, పట్టణాల్లో 14 శాతం, నగర పరిసరాల్లో 28 శాతం వివాదగ్రస్తంగా ఉన్నాయని పుష్కరకాలం క్రితం ప్రణాళిక సంఘం పేర్కొంటే- దేశవ్యాప్తంగా సివిల్‌ వివాదాల్లో మూడింట రెండొంతులు భూములకు సంబంధించినవేనని మరో అధ్యయనం నిర్ధారించింది. భూమిపై హక్కులు, వాస్తవ పరిస్థితి కచ్చితంగా తెలిపే రికార్డులు, మెరుగైన భూపరిపాలన- స్థూల దేశీయోత్పత్తిలో 1.3 శాతం పెరుగుదలకు దోహదపడుతుందన్న అంచనాలున్నాయి. కాబట్టే అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్‌, స్విట్జర్లాండ్‌ వంటి దేశాలు భూమిపై యాజమాన్య హక్కుకు పూర్తి భద్రత కల్పించే ‘టైటిల్‌ గ్యారంటీ’ వ్యవస్థను నెలకొల్పుకొన్నాయి. ఆ తరహా టైటిల్‌ గ్యారంటీ కోసం భూరికార్డుల ప్రక్షాళన, సాంకేతికత సాయంతో భూలావాదేవీల సత్వర నమోదు, సర్వే దస్త్రాలను ఇతర భూ రికార్డులతో అనుసంధానం, రెవిన్యూ రిజిస్ట్రేషన్‌ విభాగాల మధ్య సమన్వయం సాధించాలని 2016లో కేంద్రం ప్రతిపాదించింది.

దేశానికే ఆదర్శం కావాలి!

దేశవ్యాప్తంగా గ్రామీణ భారతంలో భూరికార్డుల నవీకరణకు రూ.11 వేల కోట్ల పథకాన్ని కేంద్రం సిద్ధం చేసినా అది నత్తనడకన సాగుతున్న నేపథ్యంలో- ప్రతి అంగుళం భూమి సర్వేకూ కేసీఆర్‌ సర్కారు సంసిద్ధత చాటుతోంది. పట్టణాల్లోని ఖాళీ స్థలాలు సహా స్థిరాస్తుల సర్వే నిర్వహించి నెంబర్లతోపాటు వివరాలను డేటాబేస్‌లో కర్ణాటక పొందుపరచగా, ఒకేఒక్క ల్యాండ్‌ రెవిన్యూ కోడ్‌తో యూపీ ఆదర్శంగా నిలుస్తోంది. కొత్త చట్టం అమలులో భాగంగా జిల్లాకొక భూవివాద పరిష్కార ట్రైబ్యునల్‌, రాష్ట్రస్థాయి అప్పిలేట్‌ ట్రైబ్యునళ్లను శాశ్వతంగా ఏర్పాటు చెయ్యడం విశాల జన హితకరమవుతుంది. భూమి హక్కుల రికార్డు(ఆర్‌ఓఆర్‌) నుంచి వడివడిగా టైటిల్‌ గ్యారంటీ వ్యవస్థకు మళ్ళే క్రమంలో తెలంగాణ చొరవ, దేశానికే ఆదర్శం కావాలి!

ఇవీ చూడండి: అసైన్డ్‌ భూములు కబ్జాలో ఉన్నవారికే ఇచ్చే యోచన.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.