ETV Bharat / city

Rice Collection: రాష్ట్రంలో సన్న బియ్యం సేకరణకు సర్కారు అనుమతి.. - rice procurement news

రాష్ట్రంలో సన్న బియ్యం సేకరణకు సర్కారు అనుమతి ఇచ్చింది. ఈమేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 80,000 మెట్రిక్ టన్నుల బియ్యం వినియోగించుకోవడానికి అనుమతి ఇచ్చింది.

telangana government gave permission to thin Rice Collection

author img

By

Published : Nov 17, 2021, 5:21 AM IST

రాష్ట్రంలో సన్న బియ్యం సేకరణకు సర్కారు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ సంఘీక సంక్షేమ వసతిగృహాలు, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ సంస్థల పథకాల కోసం రాష్ట్ర పూల్ కింద 1.14 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా చేయడానికి అవసరమైన అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

కొవిడ్-19 నేపథ్యంలో సాంఘీక సంక్షేమ వసతిగృహాలు, ప్రభుత్వ పాఠశాలలు 9 నెలలపాటు మూసి వేసిన దృష్ట్యా బఫర్ గోదాముల్లో 1.38 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వినియోగానికి నోచుకోలేదు. ఎక్కువ కాలం నిల్వ చేయడం వల్ల క్షీణించకుండా ఉండటానికి ప్రభుత్వం 80,000 మెట్రిక్ టన్నుల బియ్యం వినియోగించుకోవడానికి అనుమతి ఇచ్చింది. 2019-20 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో సన్నబియ్యం ప్రజా పంపిణీ పథకాల ప్రయోజనం కోసం హాస్టల్ పథకాల కింద ప్రతిపాదిత వ్యయం 16 కోట్ల రూపాయలు కనీస మద్ధతు ధరల కార్యకలాపాలకు ఉపయోగించుకోవాలని స్పష్టం చేసింది.

కస్టం మిల్లింగ్ రైస్ - సన్నబియ్యం వినియోగించడం ద్వారా సన్నబియ్యం సక్రమంగా తిరిగి అవి భర్తీ చేయాలని ఆదేశించింది. 2021-22 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో నిర్థేశిత లక్ష్యం మేరకు పథకాల అవసరాలను తీర్చడానికి ఈ బియ్యం ఉపయోగడతాయి. సీఎంఆర్‌ సన్నబియ్యం అప్‌గ్రేడ్ చేయడానికి రైస్ మిల్లర్లకు చెల్లించాల్సిన విధివిధానాలు, ఫిక్సేషన్ పరిహారంపై రాష్ట్ర స్థాయి కమిటీ చర్చించింది.

కస్టమ్ మిల్లింగ్ కోసం పంపిణీ చేయబడిన నాణ్యమైన వరి నుంచి మిల్లింగ్ పాయింట్ వద్ద 10 శాతం మించకుండా విరిగిన బియ్యం సేకరిస్తారు. ఆ ప్రకారం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ల నుండి 13 జిల్లాల కలెక్టర్లు టెండర్లు పిలిచిన తర్వాత ఆ సంఘాల నేతలతో చర్చించిన మీదట రాష్ట్ర కమిటీ 25 నుండి 10 శాతం అప్‌గ్రేడేషన్ కోసం క్వింటాల్‌కు 140 చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. 2021-22 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో నిర్థేశిత లక్ష్య పథకాల అవసరాలను తీర్చడానికి ఈ బియ్యం ఉపయోగడతాయి.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.