ETV Bharat / city

'అధిక రేట్లకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు' - goods rates increse

రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం వేసేందుకు సర్కారు సమాయత్తమైంది. కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లోకి వచ్చిన తరుణంలో నిత్యావసర వస్తువులు, వంట గ్యాస్ కృత్రిమ కొరత, అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. విపత్కర పరిస్థితులు ఉన్న వేళ... కొవిడ్-19, విపత్తు నిర్వహణ చట్టం నిబంధనలు ఉల్లంఘిస్తే టోకు, చిల్లర వ్యాపారులెవరైనా సరే కఠిన చర్యలు తప్పవంటూ ప్రభుత్వం హెచ్చరించింది.

telangana government focus on essential commodities rates

author img

By

Published : May 13, 2021, 6:04 PM IST

నిత్యావసరాల పంపిణీపై సర్కారు ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. లాక్‌డౌన్ మార్గదర్శకాలు అమల్లో ఉన్న దృష్ట్యా... ఉదయం 6 నుంచి 10 గంటల వరకు చౌకధరల దుకాణాలు నడుస్తాయి. ఇదే అదునుగా తీసుకుని టోకు, చిల్లర వ్యాపారులెవరైనా... బియ్యం, పప్పు దినుసులు, వంట నూనెలు, పాలు, ఇతర నిత్యావసర వస్తువులు, వంట గ్యాస్ అక్రమంగా నిల్వ చేయడం, తరలించడం, అధిక రేట్లకు విక్రయించడం, తూకాల్లో తేడాలకు పాల్పడితే సహించబోమని ప్రభుత్వం హెచ్చరించింది. ఎవరైనా ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఉద్ఘాటించింది.

లాక్‌డౌన్ దృష్ట్యా... ఆయా అంశాలపై చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ శ్రీమతి బి. బాలమాయాదేవి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల, రవాణ శాఖల కమిషనర్లు, హైదరాబాద్, వరంగల్ డీఐజీలు, ఔషధ నియంత్రణ విభాగం, ఉద్యాన, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్లు, తూనికల కొలతల విభాగం కంట్రోలర్, పాడిపరిశ్రాభివృద్ధి సహకార సంస్థ ఎండీ, ఎల్‌పీపీ, దాల్‌మిల్, ఆయిల్‌మిల్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. పది రోజులపాటు లాక్‌డౌన్ కొనసాగనున్న తరుణంలో నిరంతరం నిఘా కొనసాగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఎక్కడా కూడా వినియోగదారులకు నిత్యావసర వస్తువుల కొరత ఉత్పన్నం కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వాణిజ్య, వ్యాపార సంఘాలకు సూచించారు.

నిబంధనల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా... ప్రత్యేకించి రాజధాని హైదరాబాద్​లో కూడా ఉదయం 6 నుంచి 10 గంటల వరకు చౌక ధరల దుకాణాలు తెరిచే ఉంటాయి. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన పెట్టుకోకుండా రేషన్ కార్డుదారులంతా నిబంధనలు పాటిస్తూ దుకాణాలకు వచ్చి కోటా రేషన్ బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు తీసుకెళ్లవచ్చని తెలిపారు. ఆ సమయంలో గుంపులు రాకుండా ఒక్కొక్కరూ వచ్చే క్రమంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచించారు.

కాసుల కోసం కక్కుర్తిపడి టోకు, చిల్లర మార్కెట్‌ సహా ఎక్కడైనా సరే నిత్యావసర వస్తువుల కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించినా వినియోగదారులు 040-23447770 నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో పటిష్టంగా అమలవుతున్న లాక్‌డౌన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.