ETV Bharat / city

"మన ఊరు- మన బడి" మరో టెండర్‌ రద్దు.. హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

Mana Uru Mana Badi: మన ఊరు- మన బడి కార్యక్రమం కోసం పిలిచిన మరో టెండరును తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. టెండర్లపై పలు సంస్థలు హైకోర్టును ఆశ్రయించగా.. ధర్మాసనం విచారణ చెపట్టింది. ఈ నేపథ్యంలోనే టెండర్లను రద్దు చేసినట్టు న్యాయస్థానానికి సర్కారు తెలిపింది.

Telangana Government  cancelled tenders about Mana Uru Mana Badi

author img

By

Published : Jul 13, 2022, 3:44 PM IST

Mana Uru Mana Badi: "మన ఊరు- మన బడి" కార్యక్రమం కింద పిలిచిన మరో టెండరును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో గ్రీన్‌ చాక్‌ బోర్డుల కొనుగోళ్ల కోసం పిలిచిన టెండర్లను రద్దు చేసినట్లు రాష్ట్ర సర్కారు హైకోర్టుకు తెలిపింది. ఇటీవల డ్యూయల్‌ డెస్క్‌లు, టేబుళ్లు, ఫర్నిచర్‌ సరఫరా నిమిత్తం గతంలో పిలిచిన టెండర్లను రద్దు చేసి మళ్లీ పిలవాలని నిర్ణయించినట్లు హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం.. తాజాగా గ్రీన్‌ చాక్‌ బోర్డుల కొనుగోళ్ల టెండర్ల రద్దు అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. మరోవైపు పాఠశాలల్లో పెయింటింగ్‌ టెండర్లపై విచారణ కొనసాగనుంది.

నిబంధనల్లో పేర్కొన్న ప్రకారం టెండర్‌ సమర్పించినా.. తమను అనర్హులుగా ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ కేంద్రీయ భాండార్‌ జెనిత్‌ మెటప్లాస్ట్‌, వీ3 ఎంటర్‌ప్రైజెస్‌ సంయుక్త భాగస్వామ్య సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆ పిటిషన్లపై విచారణ జరిపింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.