ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలన్నింటికి దరఖాస్తుల గడువును రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మరోసారి పొడిగించింది. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ఎంసెట్, ఐసెట్, ఈసెట్, పీజీ ఈసెట్, లాసెట్, పీజీఎల్‌సెట్, ఎడ్‌సెట్, పీఈసెట్లకు గడువు పొడిగించినట్లు తెలిపారు.
లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే రెండు సార్లు దరఖాస్తు గడువు పొడిగిచడంతో పాటు.. ఈనెలలో జరగాల్సిన ప్రవేశపరీక్షలను వాయిదా వేశారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది.
ఇదీ చదవండి: ఆపరేషన్ చిరుత... ఎంతవరకు వచ్చిందంటే?