ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. పాఠశాలలు, వసతిగృహాలు ప్రారంభం కానున్న దృష్ట్యా అధికారులు వాటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి సూచించారు. ఎక్కడైనా మరమ్మతులు అవసరముంటే వెంటనే పూర్తి చేయాలని, నిధులు కూడా మంజూరు చేసినట్లు చెప్పారు.
పాఠశాలల్లో కొవిడ్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యాశాఖ ప్రత్యేక సీఎస్ చిత్రారామచంద్రన్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కాసేపట్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ప్రైవేట్ ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలతో భేటీ కానున్నారు.
- ఇదీ చూడండి : కాళేశ్వరం చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్