ETV Bharat / city

పెరిగిన ఎండల తీవ్రత... బడి వేళలు తగ్గించిన విద్యాశాఖ

School timings Reduced: తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. దీంతో అప్రమత్తమైన పాఠశాల విద్యాశాఖ బడివేళలు తగ్గించాలని నిర్ణయించింది. కుదించిన వేళలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని విద్యాశాఖ తెలిపింది.

School timings Reduced
బడి వేళలు తగ్గించిన విద్యాశాఖ
author img

By

Published : Mar 30, 2022, 10:38 PM IST

School timings Reduced: ఎండల తీవ్రత పెరగడంతో పాఠశాలల వేళలు తగ్గించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. గురువారం నుంచి ఉదయం 11.30గంటల వరకే విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉదయం 8గంటల నుంచి 11.30గంటల వరకు పాఠశాలలు పనిచేయనున్నాయి. ఈ మేరకు డీఈఓలకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఆదేశాలు జారీ చేశారు.

కుదించిన వేళలు ఏప్రిల్‌ 6 వరకు పాటించాలని విద్యాశాఖ ఆదేశాల్లో పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని విద్యాశాఖ తెలిపింది. ఏప్రిల్ 7 నుంచి 16 వరకు SA-2 పరీక్షలు జరగనున్నాయి. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి ఏప్రిల్ 16 వరకు SA-2 పరీక్షలు నిర్వహించి 20న విద్యార్థులకు సమాధాన పత్రాలు ఇస్తారు. ఏప్రిల్ 23న SA-2 ఫలితాలు ప్రకటించి... 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.

ఇదీ చదవండి:'రానున్న రోజుల్లో ఎండ మరింత తీవ్రం... అప్రమత్తత అవసరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.