ETV Bharat / city

National Doctors' Day : అలసట ఎరుగని యోధులు.. ప్రాణాలు కాపాడిన దేవుళ్లు - world doctors day 2021

కరోనా మహమ్మారికి.. ప్రపంచమంతా అతలాకుతలమైపోతుంటే దానికి అడ్డునిలబడి మేమున్నామంటూ సేవలందించారు వైద్యులు. తమ ప్రాణాలు లెక్కచేయకుండా.. ధైర్యంగా కొవిడ్ బాధితులకు చికిత్స అందించారు. ఈక్రమంలో వారికి వైరస్ సోకినా తొణకలేదు. తోటి ఉద్యోగులు మహమ్మారి ధాటికి తాళలేక అసువులు బాసినా బెనకలేదు. వెనుకడుగు వేయలేదు. జనజీవనం అతలాకుతలమైన వేళ.. ముందు నిలబడి కాపు కాసి అపర బ్రహ్మలయ్యారు. గురువారం జాతీయ వైద్యుల దినోత్సవం(National Doctors' Day) సందర్భంగా కొందరు ప్రముఖ వైద్యుల అనుభవాలు వారి మాటల్లోనే..

National Doctors' Day, Doctors' Day, National Doctors' Day 2021
డాక్టర్స్ డే, జాతీయ వైద్యుల దినోత్సవం, డాక్టర్స్ డే 2021
author img

By

Published : Jul 1, 2021, 11:44 AM IST

వైద్యో నారాయణో హరిః అంటారు. కరోనా విజృంభించిన సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంతోమంది డాక్టర్లు అమూల్యమైన సేవలందించారు. కుటుంబ సభ్యులు సైతం దూరంగా జరిగిన సమయంలో తామున్నామంటూ కంటికి రెప్పలా కాపాడుకొని పునర్జన్మ ప్రసాదించిన ఘనత వైద్యులకే దక్కుతుంది. సేవలందిస్తున్న క్రమంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయినా వెరవలేదు. కరోనా బాధితులకు చికిత్సనందిస్తూ.. వారు ధైర్యం కోల్పోకుండా నిత్యం పర్యవేక్షించారు. పరిస్థితి విషమించిన రోగుల ప్రాణాలు కాపాడటానికి ఎంతో శ్రమించారు. సాధ్యమైనంత వరకు పరిస్థితి చేయిదాటకుండా కష్టపడ్డారు. ఈ క్రమంలో శారీరకంగా.. మానసికంగా ఎంతో క్రుంగిపోయారు. అయినా వెనకడుగేయకుండా.. ప్రజలకు సేవచేయడమే లక్ష్యంగా ముందుకు కదిలారు. ఎన్నో ప్రాణాలను కాపాడారు. మరెన్నో కుటుంబాలు రోడ్డున పడకుండా సాయపడ్డారు.

50 వేల మందిని కాపాడాం

డాక్టర్‌ రాజారావు, సూపరింటెండెంట్‌, గాంధీ వైద్యశాల

రెండు దశల్లో 50 వేల మంది బాధితులు గాంధీలో చికిత్స పొంది క్షేమంగా ఇళ్లకు చేరారు. కోలుకున్న వారు చూపించే ప్రేమ, అభిమానాలతో, శ్రమంతా మర్చిపోయే వాళ్లం. వైద్యులు, సిబ్బంది కలిపి 2900 మంది అంకితభావంతో పనిచేశారు. తొలి విడతలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నాం. 8-12 గంటలపాటు పీపీఈ కిట్లలో ఉండడం వల్ల ఉక్కిరిబిక్కిరి అయ్యేవారం. ఎంతోమంది సహచరులకు కరోనా సోకింది. కోలుకొని అదే ఉత్సాహంతో విధుల్లో చేరారు. ప్రాణాలను కాపాడటం ఎంతో సంతృప్తినిస్తుంది. అది వైద్య వృత్తిలోనే సాధ్యం.

సంబంధం దెబ్బతినకూడదు

డాక్టర్‌ గురవారెడ్డి, ఎండీ, సన్‌షైన్‌ ఆసుపత్రి

గత ఏడాదిగా సమాజంలో వైద్యుల పాత్ర కీలకంగా మారింది. కంటికి కనిపించని వైరస్‌తో యుద్ధం చేసి ప్రాణాలు కాపాడారు. కొందరు పూలు చల్లారు. మరికొందరు రాళ్లూ వేశారు. డాక్టర్లకు రెండూ సమానమే. ఎవ్వరూ రోగి ప్రాణాలు తీయాలని అనుకోరు. ప్రతీ రంగంలో ఉన్నట్లే.. ఒకరిద్దరి వల్ల అందరిని అదే గాటన కట్టకూడదు. వేలాది మంది డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. డిప్రెషన్‌లోకి వెళ్లారు. అయినా వెనకడుగు వేయలేదు. నాడి పట్టేవాడిపై నమ్మకం ఉంచండి. రోగి-వైద్యుడి సంబంధం దెబ్బతినకూడదు. అది సమాజానికి నష్టం.

రాత్రి, పగలు ఆసుపత్రికే పరిమితం

డాక్టర్‌ భాస్కర్‌రావు, ఎండీ, కిమ్స్‌ ఆసుపత్రులు

మహమ్మారి ఉద్ధృతి సమయంలో ఎంతో ఒత్తిడి ఎదుర్కొన్నా, డాక్టర్లు తమను తాము కాపాడుకుంటూనే, కుటుంబ సభ్యులను రక్షించుకుంటూనే, రోగులకు రాత్రి పగలూ సేవలు చేశారు. లాక్‌డౌన్‌లో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైతే, వారు సమాజ సేవలో నిమగ్నమయ్యారు. వెంటిలేటర్‌పై ఉన్నవారినీ కాపాడారు. రోగులు, వారి కుటుంబ సభ్యుల కంటే వైద్యులపై ఎన్నో రెట్ల ఒత్తిడి ఉంటుంది. వారి సేవలు ఎనలేనివి. ఈ సందర్భంగా వారికి పేరుపేరునా శుభాకాంక్షలు.

ఎదురెళ్లి పోరాడారు

డాక్టర్‌ హరిప్రసాద్‌, అధ్యక్షుడు, అపోలో గ్రూపు ఆసుపత్రులు

గడిచిన 500 రోజుల్లో వైద్యులు పడిన కష్టం, బాధ చాలా మంది తమ జీవితాల్లో చూసి ఉండరు. ప్రపంచమే వణికిపోతున్న వేళ ఎదురెళ్లి సమాజాన్ని కాపాడారు. దేశ వ్యాప్తంగా రోజుకిద్దరు డాక్టర్ల చొప్పున చనిపోయారు. మొత్తం 1500 మంది అసువులు బాశారు. అయినా అధైర్యపడలేదు. అదే గొప్పతనం. ఇప్పటికైనా ప్రజలంతా వ్యాక్సిన్‌ తీసుకొని జాగ్రత్తలు పాటించాలి. మూడో దశ రాకుండా చూసుకోవాలి.

వృత్తిపరమైన ఒత్తిడి పెరిగింది

డాక్టర్‌ తపస్వి కృష్ణ, కన్సల్టెంట్‌ పల్మనాలజిస్టు, గ్లెనిగల్‌ గ్లోబల్‌

కరోనాతో వైద్యులపై వృత్తిపరమైన ఒత్తిడి పెరిగింది. రోగులకు దగ్గరగా పనిచేయడం వల్ల ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఎక్కువే. తరచూ ఇలాంటి పరిస్థితి డాక్టర్లకు క్షేమం కాదు. పనితీరుపై ప్రభావం చూపుతుంది. తమ ప్రణాళికలను ఎప్పటికప్పుడు మార్చుకొని ముందుకెళ్లాలి.

యుద్ధ క్షేత్రంలో సైనికుల్లా

డాక్టర్‌ రఘురాం, డైరెక్టర్‌, కిమ్స్‌-ఉషాలక్ష్మి సెంటర్‌ ఫర్‌ బ్రెస్ట్‌ డిసీజెస్‌

బాధితుల ప్రాణాలు కాపాడమే ఏకైక లక్ష్యంగా ప్రతి వైద్యుడు ముందుకు కదిలారు. తమ బాధ్యత ఏమిటో దేశానికి చాటారు. యుద్ధ క్షేత్రంలో సైనికులు పనిచేసినట్లు నిరంతరం పనిచేస్తున్నారు. కరోనాతో ఈ వృత్తికి విలువ పెరిగింది. వారికి ప్రజలు సహకరించాలి. ఇంకా మహమ్మారి వీడలేదు. ప్రతి ఒక్కరూ మరో సంవత్సరం బాధ్యతగా ఉండాలి.

సహచరులను కోల్పోయినా ధైర్యం సడలకుండా..

డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి, ఛైర్మన్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంట్రాలజీ

రోనా రోగులనే కాదు...వైద్యులను ఎంతో ఇబ్బంది పెట్టింది. వృత్తి పరంగా వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. చికిత్సను అందించే క్రమంలో ఎంతోమంది వైద్యులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. కొంతమంది ఇష్టమైన వారిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఆ బాధను దిగమింగుకుంటూనే రోగులకు సేవలు అందించి మానవీయతను చాటుకున్నారు. సమాజానికి సేవ అందించారు. ఎంతోమంది రోగులకు భరోసా అందించి వారికి స్వస్థత చేకూర్చారు. వైద్య వృత్తికే వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్‌ బీసీ రాయ్‌ అందించిన స్ఫూర్తితో విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగడం మన కర్తవ్యం. అదే డాక్టర్ల దినోత్సవం సందర్భంగా ఆయనకు అందించే నివాళి. అందుకే తలెత్తి వైద్యులంతా ధైర్యంగా చెప్పుకోవాలి... ఎస్‌.. నేను ఒక డాక్టర్ని అని.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.