ETV Bharat / city

స్వీయ నిర్బంధంలోకి మంత్రి హరీశ్‌.. వరంగల్‌లో ఓ ఎమ్మెల్యేకి! - హరీశ్​రావు పీఏకు కరోనా

రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడటం లేదు. రోజూ వందల్లోనే కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులూ వైరస్‌ గండంతో గజగజ వణుకుతున్నారు. మంత్రి హరీశ్​రావు వ్యక్తిగత సహాయకుడికి కరోనా నిర్ధరణ కావడంతో మంత్రితో పాటు ఆయన వెంట ఉండే 51 మందికి పరీక్షలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని ఓ ఎమ్మెల్యేకి కూడా పాజిటివ్​ వచ్చినట్లు సమాచారం.

రాష్ట్రంలో కరోనా
రాష్ట్రంలో కరోనా
author img

By

Published : Jun 13, 2020, 5:52 AM IST

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం మరో 164 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారిన పడి తాజాగా 9 మంది మృతిచెందారు. శుక్రవారం కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 133నిర్ధరణ అయ్యాయి. మేడ్చల్‌లో 6, రంగారెడ్డిలో 6, సంగారెడ్డిలో 4, నిజామాబాద్‌లో 3, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, ములుగు జిల్లాల్లో 2 చొప్పున, సిద్దిపేట, యాదాద్రి, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్‌, వనపర్తి జిల్లాల్లో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. అయితే సంగారెడ్డిలో శుక్రవారం 22 కేసులు నమోదైనట్లు డీఎంహెచ్​ఓ మోతీరాం పేర్కొన్నారు.

మొత్తంగా రాష్ట్ర వాసుల్లో బాధితుల సంఖ్య 4,035కు చేరింది. వలసలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో నమోదైన కేసులు 449కు చేరాయి. తాజా కేసులతో కలిపి మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 4వేల 484కు చేరింది. ఇప్పటి వరకూ 2,0278 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం 2,032 మంది వివిధ ఆసుపత్రులు, ఐసోలేషన్‌లలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ మహమ్మారి బారిన పడి 174 మంది మృతిచెందారు.

స్వీయ నిర్బంధంలోకి హరీశ్​..

ప్రజాప్రతినిధులనూ వైరస్‌ వణికిస్తోంది. ఆర్థికమంత్రి హరీశ్‌ రావు...హైదరాబాద్‌లోని తన నివాసంలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. సిద్దిపేటలో ఆయన వ్యక్తిగత సహాయకుడికి కరోనా నిర్ధరణ కావడంతో మంత్రితో పాటు ఆయన వెంట ఉండే 51 మందికి పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం ఫలితాల్లో అందులో మంత్రితో పాటు 17 మందికి నెగెటివ్‌ వచ్చింది.

ఓ ఎమ్మెల్యేకు..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఓ ప్రజా ప్రతినిధికీ వైరస్‌ నిర్ధరణ అయినట్లు సమాచారం. గత రెండు రోజులుగా దగ్గు, జలుబు బాధపడుతున్న ప్రజా ప్రతినిధి హైదరాబాద్​లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వైద్యులు కరోనా పరీక్షలకు పంపగా పాజిటివ్​గా నిర్ధారణ అయినట్లు సమాచారం. ఎమ్మెల్యేతో కాంటాక్ట్​లో ఉన్న వారిని అధికారులు గుర్తించి క్యారంటైన్​లో ఉండాలని సూచిస్తున్నట్లు తెలిసింది.

ప్రజల రాకపోకలు పెరిగిన తరుణంలో కేసుల సంఖ్య పెరుగుతోందని, వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో ప్రజలు సహకరించాలని ప్రజారోగ్య శాఖ సంచాలకులు కోరారు.

ఇవీ చూడండి: రూ.48వేలు దాటిన 10 గ్రాముల పసిడి ధర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.