దేవుడు కరుణించినా.. పూజారి వరమివ్వలేదన్న చందంగా ఉంది తెలంగాణ కాంట్రాక్ట్ లెక్చరర్ల పరిస్థితి. బదిలీల ప్రక్రియ చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినా.. అధికారులు నిర్లక్ష్యం వీడటం లేదు.
కేసీఆర్ ఆదేశాలతో ఆనందం వ్యక్తం చేసిన లెక్టరర్స్ అసోసియేషన్.. అధికారుల నిర్లక్ష్యంపై హైదరాబాద్ నాంపల్లి ఉన్నత విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగింది. సీఎం ఫొటోకు పాలాభిషేకం చేసిన లెక్చరర్లు.. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
13 ఏళ్లుగా అధికారులు బదిలీ చేపట్టడం లేదని, నాలుగేళ్లుగా మంత్రులు, ఉన్నతాధికారుల చుట్టూ తిరిగితే సీఎం కేసీఆర్ కరుణించారని లెక్టరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకన్న తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినా.. కొన్న సంఘాల నాయకుల దందాతో, వారి స్వార్థం కోసం బదిలీలు కోరడం లేదని తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపించారు. 2013లో నిర్వహించిన విధంగా జోనల్ స్థాయిలో వెంటనే బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి ఎగుమతులపై రైతు నిరసనల ప్రభావమెంత?