ETV Bharat / city

CM KCR PC: 'దమ్ముంటే బాయిల్డ్​ రైస్​ కొనిపించు.. కిషన్​రెడ్డి' - CM KCR Speaks on paddy Procurement

CM KCR PRESSMEET: కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డిపై సీఎం కేసీఆర్​ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రంలోని భాజపా.. రైతు వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తోందని ధ్వజమెత్తారు. కేంద్రం చిల్లర కొట్టు షావుకారిగా మాట్లాడకూడదని సూచించారు. బాయిల్డ్​ రైస్​ ఇవ్వబోమని.. మెడమీద కత్తి పెట్టి రాష్ట్రం చేత లేఖ రాయించుకొందని సీఎం చెప్పారు. కేంద్రమంత్రి కిషన్​రెడ్డికి దమ్ముంటే.. రాష్ట్రం నుంచి బాయిల్డ్​ రైస్​ కొనుగోలు చేయించాలని డిమాండ్​ చేశారు.

kcr pressmeet latest
kcr
author img

By

Published : Nov 29, 2021, 7:55 PM IST

Updated : Nov 29, 2021, 8:54 PM IST

CM KCR PRESSMEET: కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని భాజపా.. రైతు వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తోందని మండిపడ్డారు. వారి నిర్ణయాలన్నీ మధ్యతరగతి ప్రజలపై భారం వేసేవేనని ఆరోపించారు. రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కిషన్​రెడ్డి.. బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(KCR ON KISHAN REDDY) ఉండి కూడా రాష్ట్రానికి ప్రయోజనం లేదన్న కేసీఆర్​.. కిషన్‌రెడ్డికి దమ్ముంటే కేంద్రంతో ధాన్యం కొనిపించాలని డిమాండ్​ చేశారు. తెలంగాణ వాతావరణం బాయిల్డ్‌ రైస్​(Boiled rice)కే అనుకూలమని వాదన వినిపించాలని సూచించారు.

KCR on paddy: దేశంలో ఆహార ధాన్యాల సేకరణ బాధ్యత కేంద్రానిదేనని సీఎం స్పష్టం చేశారు. సేకరించిన ఆహార ధాన్యాన్ని ప్రజలకు పంపిణీ చేసేది కేంద్రమేనని చెప్పారు. ఇప్పుడు ధాన్యం కొనబోమని కేంద్రం నిరాకరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అయోమయ ప్రకటనలతో రైతులను గందరగోళానికి గురి చేస్తోందని ఆరోపించారు. భాజపా.. ప్రతి విషయాన్ని లాభనష్టాలతో బేరీజు వేసుకుంటోందని ఆరోపించిన సీఎం.. ప్రజలను కాపాడాలనే సామాజిక బాధ్యతను విస్మరించిందని విమర్శించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడలేదన్నారు. నిర్వహణ సామర్థ్యం లేని భాజపా తమపై నిందలు వేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బాయిల్డ్‌ చేయకపోతే బియ్యం ఉత్పత్తి సగానికి తగ్గిపోతుందని వివరించారు.

'గత యాసంగి ధాన్యమే కేంద్రం పూర్తిగా తీసుకోలేదు. గత యాసంగిలో రాష్ట్రం సేకరించిన ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదు. బాయిల్డ్‌ రైస్​ ఇవ్వబోమని.. మెడ మీద కత్తి పెట్టి రాష్ట్రంతో లేఖ రాయించుకున్నారు. వానాకాలంలో 60 లక్షల మెట్రిక్‌ టన్నులు తీసుకోవాలని కోరాం. రాష్ట్ర వాతావరణం దృష్ట్యా యాసంగి పంట బాయిల్డ్ రైస్​కే అనుకూలం. బాయిల్డ్‌ రైస్​ను గతంలో ఎఫ్‌సీఐ ప్రోత్సహించింది.'

- సీఎం కేసీఆర్​

కొత్త రాష్టమైనా.. కేంద్రం సహకరించనప్పటికీ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని కేసీఆర్​ స్పష్టం చేశారు. ఏపీ ఇబ్బందులు పెట్టినా, కొందరు కేసులు వేసినా ప్రాజెక్టులు నిర్మించామని చెప్పారు. తమ ప్రభుత్వం కృషి వల్లే తెలంగాణలో పంటల దిగుబడి పెరిగిందని చెప్పారు. గతంలో తెలంగాణ నుంచి 10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ మాత్రమే జరిగిందని చెప్పిన కేసీఆర్​.. తమ హయాంలో 69.3 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ జరుగుతోందని స్పష్టం చేశారు.

CM KCR PC: 'దమ్ముంటే బాయిల్డ్​ రైస్​ కొనిపించు.. కిషన్​రెడ్డి'

ఇదీచూడండి: Kishan reddy comments on KCR: 'ధాన్యం కొనేదిలేదని కేంద్రం ఎప్పుడు, ఎలా చెప్పిందో నిరూపించండి'

Last Updated : Nov 29, 2021, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.