రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో తెలంగాణ సీఐడీ డీజీ గోవింద్ సింగ్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయన భార్య చనిపోగా.. గోవింద్‌సింగ్‌తో పాటు మరో ఇధ్దరికి గాయాలయ్యాయి. గాయపడిన సీఐడీ డీజీ, డ్రైవర్‌ను బీఎస్‌ఎఫ్ అంబులెన్సులో రామ్‌గఢ్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సీఐడీ డీజీ గోవింద్‌సింగ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. తెలంగాణ సీఐడీ డీజీ ఐపీఎస్ గోవింద్‌సింగ్ తన కుటుంబంతో కలిసి రాజస్థాన్‌లోని రామ్‌గఢ్‌లో ఉన్న మాతేశ్వరి తనోత్ మాతా ఆలయ సందర్శనకు వెళ్లారు. దైవదర్శనం అనంతరం తమ కారులో తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో రామ్‌గఢ్ ప్రాంతంలో ఉన్న ఘంటియాలీ మాతా ఆలయం సమీపంలోకి రాగానే ఆయన కారు ఒక్కసారిగా బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న సీఐడీ డీజీ గోవింద్ సింగ్ భార్య షీలా సింగ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో డీజీ గోవింద్ సింగ్, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే వారిని బీఎస్‌ఎఫ్ అంబులెన్సులో రామ్‌గఢ్‌లోని ఆస్పత్రికి తరలించారు. సీఐడీ డీజీ గోవింద్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అలాగే డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
సీఐడీ డీజీ గోవింద్ సింగ్ సతీమణి షీలా మృతి పట్ల డీజీపీ మహేందర్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను అక్కడి పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీజీ గోవింద్‌సింగ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులకు ఫోన్ చేసి ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. డీజీ గోవింద్‌సింగ్ త్వరగా కోలుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆకాంక్షించారు.
ఇవీ చదవండి: