మూడు రోజుల పర్యటనలో భాగంగా దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు సహా పలు అంశాలపై చర్చించారు. సాయంత్రం 4.30 గంటలకు కేసీఆర్ ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. గోదావరి - కృష్ణా నదుల అనుసంధానానికి కేంద్రం తోడ్పాటు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు. రిజర్వేషన్ల పెంపు, విభజన చట్టం హామీలు వంటి పెండింగ్ అంశాలు ప్రస్తావించనున్నట్లు సమాచారం.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కేసీఆర్ భేటీ - kcr delhi tour
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు సాగిన సమావేశంలో రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించారు.