తెలంగాణలో ఉజ్వలమైన సంస్కృతి, సంప్రదాయాలు, అనేక అద్భుత కళలు, చారిత్రక కట్టడాలు, అందమైన అటవీ సంపద, అపురూపమైన జలపాతాలు ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana cm KCR) పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో వారసత్వ నిర్మాణాల పరిరక్షణ, పర్యాటక రంగం అభివృద్ధి(Telangana tourism)కి తీసుకుంటున్న చర్యలు ఏంటని పలువురు ప్రజాప్రతినిధులు అసెంబ్లీ(Telangana assembly sessions 2021)లో ప్రశ్నించగా.. కేసీఆర్(Telangana cm KCR) సమాధానమిచ్చారు.
రాష్ట్రంలో.. రామప్ప ఆలయమే కాకుండా వారసత్వ పరంపరలో వచ్చిన చాలా కట్టడాలు ఉన్నాయని ముఖ్యమంత్రి(Telangana cm KCR) పేర్కొన్నారు. వాటిని గుర్తించి పునర్వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని అష్టాదశ పీఠాల్లో ఒకటైన జోగులాంబ అమ్మవారి శక్తిపీఠాన్ని కూడా పాలకులు పట్టించుకోలేదని, కృష్ణా, గోదావరి పుష్కరాలకు కూడా ఆదరణ లభించలేదని కేసీఆర్(Telangana cm KCR) చెప్పారు.
ఇన్ని రోజులు నీళ్లు, విద్యుత్, వ్యవసాయం విషయంలో రాష్ట్రంలో కాస్త ఇబ్బందులున్నందున పర్యాటకం(Telangana tourism)పై దృష్టిసారించలేక పోయామని సీఎం(Telangana cm KCR) అన్నారు. కానీ ఇప్పుడు ఆ సమస్యలన్ని పరిష్కారమవ్వడం వల్ల పర్యాటక రంగాన్ని(Telangana tourism) ప్రగతి పథంలో పరుగులు పెట్టించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 160 కి.మీ. మేర గోదావరి సజీవంగా పారుతోందని తెలిపారు.
"ఇటీవల ప్రధాని మోదీని కలిసినప్పుడు ఆయనతో గొడవ పెట్టుకున్నా. తెలంగాణలో కళకు, కళాకారులకు కొదువలేదు. కానీ మా కళాకారులకు ఎందుకు గుర్తింపు ఇవ్వడం లేదని ప్రశ్నించా. పద్మ అవార్డులకు ఎన్నిసార్లు పేర్లు పంపినా.. ఎందుకు పట్టించుకోవడం లేదని అడిగా. పేర్లు పంపి విసుగు వస్తుందని...అర్హులున్నా ఎందుకు గుర్తింపు ఇవ్వడం లేదని ప్రశ్నించా. మీరేం చిన్నబుచ్చుకోవద్దని.. తప్పకుండా గుర్తింపు లభిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. ఎయిర్ స్టిప్స్ ఇస్తే తామే నిర్మాణాలు చేసుకుంటామని కూడా చెప్పాం. ఏడేళ్లయినా ఇప్పటికీ వాటి జాడ లేదు. ఎందుకింత పక్షపాతమని గొడవపడ్డాను."
- కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి
తెలంగాణను పర్యాటక రంగం(Telangana tourism)లో అభివృద్ధి చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana cm KCR) స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులంతా తమ ప్రాంతాల్లో పర్యాటక, ప్రాచుర్యం పొందిన ప్రాంతాలు, దర్శనీయ స్థలాలు, ప్రకృతి రమణీయత పంచే ప్రాంతాలు, జలపాతాలు ఉంటే వాటిపై నివేదిక మంత్రి శ్రీనివాస్ గౌడ్(Telangana tourism minister srinivas goud)కు అందజేయాలని సూచించారు. తెలంగాణలో ఉన్న ప్రకృతి సౌందర్యాలకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు దక్కేలా ప్రణాళిక రూపొందిస్తామని అసెంబ్లీ(Telangana assembly sessions 2021) సాక్షిగా ఉద్ఘాటించారు.