ETV Bharat / city

1 లేదా 2న రాష్ట్ర కేబినెట్ భేటీ? లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం

జులై ఒకటి లేదా రెండో తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో కరోనా కట్టడి, మళ్లీ లాక్‌డౌన్‌ విధించడం, ప్రత్యామ్నాయ అంశాలపై చర్చించనున్నారు. జీహెచ్‌ఎంసీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 15 రోజుల పాటు లాక్‌డౌన్ విధించాలని సీఎంకు వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. దీనిపై మంత్రిమండలిలో చర్చించనున్నారు. పీవీకి భారతరత్నం అంశంపై తీర్మానం చేయనున్నారు.

author img

By

Published : Jun 30, 2020, 5:46 AM IST

kcr
kcr

రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా దాని వ్యాప్తిని నిరోధించడం, మళ్లీ లాక్‌డౌన్‌ విధించడం, ప్రత్యామ్నాయాలు తదితర కీలక అంశాలపై చర్చించేందుకు జులై ఒకటి లేదా రెండో తేదీన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రిమండలి అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో చర్చించినట్లు తెలిసింది. దానిపై మంగళవారం స్పష్టత రానుంది.

పీవీకి భారతరత్నపై తీర్మానం

రాష్ట్రంలో కరోనా తీవ్రరూపం దాలుస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో 15 రోజుల పాటు రాజధానిలో లాక్‌డౌన్‌ విధించాలని ముఖ్యమంత్రికి వైద్యఆరోగ్యశాఖ ఇప్పటికే సిఫార్సు చేసింది. తదనుగుణంగా మూడు, నాలుగు రోజుల్లో వ్యూహం ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. మంత్రిమండలి సమావేశంలో లాక్‌డౌన్‌పై నిర్ణయంతో పాటు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న, పార్లమెంటులో ఆయన చిత్రపటం, తపాలా స్టాంపు విడుదల తదితర అంశాలపై తీర్మానాలు చేయనున్నారు.అనంతరం స్వయంగా దిల్లీకి వెళతామని సీఎం ప్రకటించారు.

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఈసారి లాక్‌డౌన్‌ మరింత కఠినంగా అమలుచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

లాక్‌డౌన్‌ 5 నుంచి 20 వరకు లేదా 6 నుంచి 21 వరకు?

వచ్చే నెల అయిదు నుంచి 20 వరకు లేదా ఆరు నుంచి నుంచి 21 వరకు లాక్‌డౌన్‌ విధించాలనే ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకు వచ్చినట్లు తెలిసింది. మంత్రిమండలి సమావేశం అనంతరం రెండు, మూడు రోజులపాటు రాకపోకలు, కొనుగోళ్లు, నిల్వలు ఇతర అవసరాలకు అవకాశమిచ్చి తర్వాత లాక్‌డౌన్‌ను అమలుచేసే ఆలోచన ఉన్నట్లు సమాచారం. జులై ఆరో తేదీ నుంచి తొమ్మిది వరకు ఎంసెట్‌ ఉంది. దాన్ని వాయిదా వేయడం లేదా పరీక్షలను ప్రత్యేక ఏర్పాట్లతో నిర్వహించడం వంటి అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఇదీ చదవండి: 59 చైనా యాప్​లపై నిషేధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.