ETV Bharat / city

కొత్తగా 10 లక్షల పెన్షన్లు.. 5వేల అంగన్​వాడీ పోస్టులు.. కేబినెట్​లో కీలక నిర్ణయాలు

Telangana cabinet meeting: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గం భేటీ సుదీర్ఘంగా సాగింది. సమావేశంలో ఆయా అంశాలపై చర్చించిన మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 21వ తేదీన శాసనసభ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాల రద్దుతో పాటు ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించింది

Telangana cabinet meeting in pragathibhavan

author img

By

Published : Aug 11, 2022, 3:18 PM IST

Updated : Aug 11, 2022, 9:02 PM IST

Telangana cabinet meeting: ఐదు గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న 36 లక్షల మందితో పాటు అదనంగా 10 లక్షల కొత్త పెన్షన్లకు ఆమోదం తెలిపింది. మెుత్తం కలిపి 46 లక్షల పెన్షన్ దారులకు కార్డులు జారీ చేయనుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5 వేల 111 అంగన్‌ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కేబినేట్‌ పేర్కొంది.

స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 21వ తేదీన శాసనసభ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలను మంత్రివర్గం రద్దు చేసింది. అదేరోజు పెళ్లిల్లు, శుభకార్యాలకు చివరి ముహూర్తం కావడంతో... ప్రజాప్రతినిధుల వినతుల మేరకు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంది.

ఈనెల 16వ తేదీన ఉదయం 11.30 నిమిషాలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన చేయాలని పేర్కొంది. వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు మంజూరు చేసింది. ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలతో పాటు ఈఎన్టీ టవర్ నిర్మించాలని నిర్ణయించింది. సరోజినీ దేవి కంటి దావాఖానలోనూ అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదించింది.

జీవో 58, 59 కింద పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేబినేట్‌ ఆదేశించింది. గ్రామకంఠంలో నూతన ఇళ్ల నిర్మాణానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులతో ఓ కమిటీ వేసింది. 15 రోజుల్లోగా నివేదిక ఇచ్చి, శాశ్వతంగా పరిష్కారం చూపాలని సూచించింది. పలు అభివృద్ధి పనులకు సంబంధించిన నిర్ణయాలకు పచ్చజెండా ఊపింది. వికారాబాద్‌లో ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ కేబినేట్‌ నిర్ణయం తీసుకుంది. తాండూరు మార్కెట్ కమిటీకి యాలాలలో 30 ఎకరాల ఎకరాల స్థలాన్ని కేటాయించింది. షాబాద్ లో షాబాదు బండల పాలిషింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి టీఎస్ ఐఐసీ ఆధ్వర్యంలో స్థలాల కేటాయింపునకు 45 ఎకరాలను కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయించింది.

ఇవీ చూడండి:

Last Updated : Aug 11, 2022, 9:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.