ETV Bharat / city

TS Lockdown: నేడు కేబినెట్​ భేటీ.. లాక్​డౌన్ పొడిగించే అవకాశం

లాక్​డౌన్ (Lockdown) కొనసాగిస్తారా.. లేదా.. అన్న విషయం నేడు తేలిపోనుంది. ఆదివారం మధ్యాహ్నం జరగనున్న కేబినెట్ భేటీలో లాక్​డౌన్​పై నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా నియంత్రణ చర్యలు, వానాకాలం పంటల సాగు సహా ఇతర అంశాలపై ఇవాళ్టి మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.

author img

By

Published : May 29, 2021, 8:06 PM IST

Updated : May 30, 2021, 6:16 AM IST

cabinet meeting
రేపు కేబినెట్​ భేటీ.. లాక్​డౌన్​పై కీలక నిర్ణయం

రాష్ట్ర మంత్రివర్గ కీలక సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) అధ్యక్షతన ప్రగతిభవన్​లో కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, లాక్​డౌన్​పై సమావేశంలో చర్చించనున్నారు. లాక్​డౌన్ (Lockdown) గడువు నేటితో ముగియనుంది. దీంతో లాక్​డౌన్ కొనసాగించాలా.. లేదా.. అన్న విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పుడిప్పుడే కొవిడ్ వైరస్ వ్యాప్తి తగ్గుతున్న తరుణంలో మరికొన్నాళ్ల పాటు లాక్​డౌన్ కొనసాగించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని లాక్​డౌన్​పై సీఎం నిర్ణయం తీసుకోనున్నారు. అటు ఇంటింటి జ్వర సర్వే, కొవిడ్, బ్లాక్ ఫంగస్ రోగులకు చికిత్స, ఔషధాలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.

టీకాలపై జరగనున్న చర్చ

రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. టీకాల కార్యక్రమంపైనా భేటీలో చర్చ జరగనుంది. వానాకాలం పంటల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పంటల సాగు, విత్తనాలు, ఎరువుల లభ్యత, సంబంధిత అంశాలపై కూడా చర్చించనున్నారు. ధాన్యం కొనుగోళ్లపైనా సమీక్షిస్తారు. అటు నీటిపారుదల అంశాలపైనా కేబినెట్​లో చర్చిస్తారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవం అంచనాలు, చెక్ డ్యాంలు సంబంధిత అంశాలపై చర్చిస్తారు.

బడ్జెట్​ కేటాయింపుల్లో మార్పులు

కరోనా, లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం బాగా తగ్గుతోంది. అటు కరోనా చికిత్స కోసం వైద్య,ఆరోగ్య శాఖకు అదనపు నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపుల్లో మార్పులు, చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. దీంతో బడ్జెట్ సంబంధిత అంశాలపై కూడా కేబినెట్​లో చర్చించనున్నారు. పరీక్షలు, విద్యా సంబంధిత అంశాలపై కూడా చర్చిస్తారు. రాష్ట్రంలో మరో ఆరు వైద్య కళాశాలల ఏర్పాటు, సబ్ రీజినల్ సెంటర్ల ఏర్పాటు, కొత్త ఎత్తిపోతల పథకాలు సహా ఇటీవల ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.

ఇదీ చదవండి: lockdown: రాష్ట్రంలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలు

Last Updated : May 30, 2021, 6:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.