ETV Bharat / city

Telangana Budget 2022: త్వరలోనే రాష్ట్ర వార్షిక బడ్జెట్​ కసరత్తు.. - కేంద్ర వార్షిక బడ్జెట్

Telangana Budget 2022: రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తు త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తైన మూడు త్రైమాసికాలను బేరీజు వేసుకొని రానున్న ఆర్థిక సంవత్సరం కోసం అధికారులు కసరత్తు చేయనున్నారు. ఆయా శాఖల నుంచి వివరాలు, ప్రతిపాదనలను క్రోడీకరించి బడ్జెట్ కసరత్తు ప్రారంభించనున్నారు.

Telangana Budget 2022 Exercise start soon

author img

By

Published : Jan 7, 2022, 5:06 AM IST

Telangana Budget 2022: కేంద్ర వార్షిక బడ్జెట్ సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించి రాష్ట్రాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. రాష్ట్రం తరఫున సమావేశానికి హాజరైన అధికారులు... అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సూచనలతో పాటు తెలంగాణ ప్రత్యేక అంశాలను కేంద్ర ఆర్థిక శాఖకు నివేదించారు. ఇటు రాష్ట్రంలోను బడ్జెట్ కసరత్తు త్వరలోనే ప్రారంభం కానుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ తయారీ కోసం ఆర్థికశాఖ కసరత్తుకు శ్రీకారం చుట్టనుంది.

కొంతమేర సఫలం..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని(2021-22)కి రాష్ట్ర ప్రభుత్వం భారీ అంచనాలతో బడ్జెట్​ను ప్రవేశపెట్టింది. గత ఏడాది కొవిడ్ కారణంగా అన్ని రంగాలు అస్తవ్యస్తమై ఆదాయం భారీగా తగ్గినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తి ఆశావహ దృక్పథంతో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఏకంగా రెండు లక్షల 30 వేల కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్‌ను ప్రతిపాదించింది. ప్రజలపై భారం మోపకుండా ఉన్న అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకొని ఖజానాకు ఆదాయాన్ని పెంచుకుంటామని సర్కార్ అప్పట్లో ప్రకటించింది. ఆ దిశగా ప్రభుత్వం కొంతమేర సఫలమైందని చెప్పుకోవచ్చు.

సగానికి పైగా పెరిగిన అంచనాలు..

భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ ధరల పెంపు, భూముల అమ్మకం, వాణిజ్య పనుల్లో లీకేజీలు అరికట్టడం లాంటి చర్యల ద్వారా ఆదాయాన్ని పెంచుకొంది. స్టాంపులు- రిజిస్ట్రేషన్ల ద్వారా డిసెంబర్ నెలాఖరు వరకు ఖజానాకు 8 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు సమాచారం. 2019-20లో గరిష్ఠంగా 7 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఇంకా మూడు నెలలు మిగిలిన నేపథ్యంలో.. మరో 3 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చి 11 వేల కోట్లను సమీపించవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 3 త్రైమాసికాలు పూర్తయ్యాయి. దీంతో ఆదాయానికి సంబంధించి ప్రభుత్వానికి స్పష్టత వచ్చింది. అక్టోబరు నెలాఖరు వరకు ఆదాయ అంచనాలను సగానికి పైగా చేరుకుంది.

కేటాయింపులు పూర్తయిన వెంటనే..

నవంబర్, డిసెంబర్ నెలల్లోనూ ఖజానాకు ఆదాయం బాగానే ఉంది. బడ్జెట్ అంచనాలను పూర్తిగా అందుకోలేనప్పటికీ గత ఆర్థికసంవత్సరంతో పోలిస్తే ఆదాయం బాగానే పెరిగింది. వీటిని దృష్టిలో ఉంచుకొని రానున్న ఆర్థిక సంవత్సరానికి అంచనాలను సిద్ధం చేయనున్నారు. మరో రెండు నెలల గడువున్న నేపథ్యంలో బడ్జెట్ కసరత్తు ప్రారంభించేందుకు ఆర్థికశాఖ సిద్ధమవుతోంది. త్వరలోనే బడ్జెట్ ప్రతిపాదనల కోసం ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర వ్యయాల వివరాలతో పాటు వచ్చే ఏడాది అవసరాలను ఆయా శాఖల నుంచి తీసుకోనున్నారు. వాటన్నింటిని క్రోడీకరించి బడ్జెట్ కసరత్తు చేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగుల విభజన, కేటాయింపుల ప్రక్రియ పూర్తయిన వెంటనే బడ్జెట్‌పై దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.