రూ.2,30,825.96 కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూపుదిద్దుకుంది. రూ.1,69,383.44 కోట్లు రెవెన్యూ వ్యయంగా లెక్కతేల్చారు. రూ.45,509.6 కోట్లు ఆర్థిక లోటుగా అంచనా వేశారు. 29 వేల రూ.46.77 కోట్లు పెట్టుబడి వ్యయాలకు కేటాయించారు. రూ.6,743.50 కోట్లు రెవెన్యూ మిగులు ఉంటుందని అంచనా వేశారు.
శాఖల వారిగా కేటాయింపులను పరిశీలిస్తే.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. రూ.29,271 కోట్లు కేటాయించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద రూ.5 కోట్ల చొప్పున కేటాయిస్తూ వార్షిక పద్దులో రూ.800 కోట్లు లెక్కచూపించారు. ఈసారి దళితుల కోసం 'సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్' ప్రత్యేక పథకం ప్రకటించిన ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించింది.