భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం రాత్రి దిల్లీకి బయలుదేరి వెళ్లారు. వచ్చే నెల 2,3 తేదీల్లో హైదరాబాద్లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దానిపై చర్చించేందుకు బుధవారం అందుబాటులో ఉండాలంటూ భాజపా అధిష్ఠానం ఇచ్చిన సమాచారం మేరకు ఆయన దిల్లీ వెళ్లినట్లు తెలిసింది. కార్యవర్గ సమావేశాల స్టీరింగ్ కమిటీలో ఉన్న రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలు కూడా ఆయన వెంట వెళ్లారు. వారంతా పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సహా ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉంది.
సంజయ్కు అదనపు భద్రత.. బండి సంజయ్కు పోలీసులు భద్రత పెంచారు. ప్రస్తుతమున్న దానికి అదనంగా(1+5) ఆరుగురితో కూడిన రోప్ పార్టీని కేటాయించారు. మరో ఎస్కార్టు వాహనం ఏర్పాటు చేశారు. పర్యటనల సమయంలో ఆయనకు ఈ మేరకు అదనపు సిబ్బంది భద్రత కల్పిస్తారు. అగ్నిపథ్ పథకంపై ఆందోళనలతో పాటు ఇటీవల కరీంనగర్లో సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచాలని నిఘా వర్గాలు సూచించిన మీదట అదనపు భద్రత కల్పించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: నరసరావుపేట నుంచి హైదరాబాద్‌కు ఆవుల సుబ్బారావు తరలింపు
Harish Rao Fire On Central: కేంద్రం నిరుద్యోగ యువతను మోసం చేస్తోంది: హరీశ్ రావు