ETV Bharat / city

టీఎస్ బీపాస్ సహా కీలక బిల్లులకు శాసనసభ ఆమోదం

author img

By

Published : Sep 14, 2020, 5:58 PM IST

Updated : Sep 14, 2020, 11:06 PM IST

టీఎస్ బీపాస్ సహా పలు బిల్లులకు శాసనసభ ఆమోదముద్ర వేసింది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు సహా విపత్కర పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వోద్యోగులకు వేతనాల్లో కోత, అదనపు అప్పు కోసం ఉద్దేశించిన బిల్లులు ఇందులో ఉన్నాయి. అదనపు అప్పుల బిల్లుపై సందేహాలకు అవకాశం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది.

telangana assembly
telangana assembly
టీఎస్ బీపాస్ సహా కీలక బిల్లులకు శాసనసభ ఆమోదం

ప్రశ్నోత్తరాల అనంతరం శాసనసభలో ప్రభుత్వ బిల్లులపై చర్చ జరిగింది. గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్​ల స్థానంలో తీసుకొచ్చిన బిల్లులతో పాటు ఇతర బిల్లులు ఇందులో ఉన్నాయి. రాష్ట్రంలో ఐదు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతులు మంజూరు చేస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల విషయంలో రాష్ట్రంలో 25వ స్థానంలో ఉందన్న తెరాస సభ్యుడు రాజేందర్ రెడ్డి... ప్రస్తుత విశ్వవిద్యాలయాలు ఎలాంటి పరిశోధనలు లేకుండా తహసీల్దార్​ కార్యాలయాల్లా తయారయ్యాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

తెరాస నేతలకే ఇచ్చారు

ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ సభ్యుడు శ్రీధర్ బాబు ఆరోపించారు. అధ్యాపక ఖాళీలను భర్తీ చేయకపోగా... కనీసం ఉపకులపతులను కూడా నియమించలేదని విమర్శించారు. తెరాస మేనిఫెస్టోలోని కేజీ టు పీజీ ఉచితవిద్య అంశానికి భంగం కలగడం లేదా అని ప్రశ్నించిన ఆయన... ఎంత మంది పేదలకు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఐదింటిలో మూడింటిని తెరాస నేతలకే ఇచ్చారని, వివాదాస్పద భూముల్లోని సంస్థలకు కూడా అనుమతులు ఇచ్చారని శ్రీధర్ బాబు అన్నారు.

త్వరలోనే నియామక ప్రక్రియ

బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి... మొత్తం 16 ప్రతిపాదనల్లో అన్నింటినీ పరిశీలించి ఐదింటికి అనుమతులు ఇచ్చామని, మరో మూడు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. కొత్త వాటికి ఫీజు రీఎంబర్స్​మెంట్ వర్తించబోదని తెలిపారు. ఫీజుల నిర్ధరణ కమిటీలో ప్రభుత్వ ప్రతినిధి ఉంటారన్న మంత్రి... రాష్ట్ర విద్యార్థులకు 25శాతం సీట్లు కేటాయించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను సర్కార్ అలక్ష్యం చేయడం లేదని, న్యాయవివాదాల వల్లే ఉపకులపతులు, అధ్యాపకుల నియామకం ఆలస్యమైందని వివరించారు. త్వరలోనే వీసీల నియామక ప్రక్రియ పూర్తవుతుందని, అధ్యాపకుల నియామకాలు కూడా చేపడతామని మంత్రి పేర్కొన్నారు.

నిపుణుల కొరత దృష్ట్యా

విపత్కర పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించేలా, ఆయుష్ వైద్యుల పదవీవిరమణ వయోపరిమితి పెంచేందుకు, కరోనా నేపథ్యంలో అదనంగా అప్పులు తీసుకునే బిల్లులును సభలో ఆర్థిక మంత్రి హరీశ్​ రావు ప్రవేశపెట్టారు. పదవీవిరమణ వయోపరిమితి పొడిగింపు ఏమేరకు సబబని ప్రశ్నించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క... బిల్లుపై నిరసన వ్యక్తం చేశారు. వైద్య కళాశాలల్లో నిపుణుల కొరత దృష్ట్యా అధ్యాపకుల వయో పరిమితిని పెంచుతున్నట్లు మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. కరోనాతో ఉత్పన్నమైన పరిస్థితుల వల్ల కేంద్రం ఇచ్చిన వెసులుబాటుకు అనుగుణంగా అదనపు అప్పు కోసం చట్టసవరణ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.

అప్పులు తెచ్చి సంపద సృష్టిస్తున్నాం

అప్పుల విషయంలో రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. రాష్ట్ర అప్పులు రూ.4.60 లక్షల కోట్లు దాటాయని, తాజా సవరణతో అది ఆరు లక్షల కోట్లకు పెరుగుతుందన్నారు. కార్పొరేషన్ల రుణాలను పరిగణలోకి తీసుకోరాదనడం సబబు కాదని... వాటిని కూడా ప్రభుత్వమే చెల్లించాలి కదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యల వల్ల పెద్దఎత్తున ఆర్థికభారం పడుతుందని పేర్కొన్నారు. భట్టి వ్యాఖ్యలతో విభేదించిన మంత్రి హరీశ్​ రావు... పెరిగిన ఆదాయానికి అనుగుణంగా అప్పులు తెచ్చి సంపద సృష్టిస్తున్నామని అన్నారు. తెరాస సర్కార్​కు మంచిపేరు వస్తుందని భట్టి ఆందోళన చెందుతున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ వాకౌట్

రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత అప్పులు రూ.1,54,557 కోట్లని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కంటె తెలంగాణ అప్పుల శాతం తక్కువగా ఉందని, విశ్వసనీయత ఎక్కువగా ఉందని వివరించారు. అప్పుల్లో తెలంగాణ చివరి నుంచి రెండో స్థానంలో ఉందన్నారు. దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందన్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని కేంద్రం ఇటీవలే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. రుణపరిమితి పెంపుకోసం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ షరతును కాంగ్రెస్ అంగీకరిస్తుందా అని హరీశ్​ రావు ప్రశ్నించారు. ఆర్థికమంత్రి సమాధానం అనంతరం సందేహాల నివృత్తి కోసం కాంగ్రెస్ సభ్యులు ప్రయత్నించారు. అవకాశం ఇవ్వకపోవడంతో సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఏకగ్రీవం

జీఎస్టీ చట్టసవరణ బిల్లును ముఖ్యమంత్రి తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రవేశపెట్టారు. సివిల్ కోర్టుల సవరణ బిల్లుతో పాటు కోర్టు ఫీజులు, సూట్ల వ్యాల్యుయేషన్ చట్ట సవరణ బిల్లులను న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సభ ముందుంచారు. బిల్లులన్నీ కూడా ఏకగ్రీవంగా సభ ఆమోదం పొందాయి. సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.

ఇదీ చదవండి: 'అధ్యాపకులు లేక వైద్య సీట్లు కోల్పోయే పరిస్థితి ఉండకూడదు'

Last Updated : Sep 14, 2020, 11:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.