ETV Bharat / city

సీఏఏ వ్యతిరేక తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

సీఏఏను కేంద్రం పునఃసమీక్షించాలంటూ ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. తీర్మానాన్ని అన్నిపక్షాలు సమర్థించగా భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రమే వ్యతిరేకించారు. ఆయన అభ్యంతరాల మధ్యే సీఏఏపై తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది.

cm kcr
cm kcr
author img

By

Published : Mar 16, 2020, 9:19 PM IST

Updated : Mar 16, 2020, 10:24 PM IST

పౌరసత్వ సవరణ చట్టాన్ని పునఃసమీక్షించాలంటూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్​ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఎన్నో సమస్యలుంటే సీఏఏపై మోదీ సర్కారుకు అంత మొండివైఖరి ఎందుకని సీఎం ప్రశ్నించారు. పార్లమెంటులో బిల్లును తాము వ్యతిరేకించినట్టు గుర్తుచేశారు. ఓటరు కార్డు సీఏఏకి పనికిరాదని అనడం హాస్యాస్పదమని అన్నారు.

నాకే పుట్టినరోజు ధ్రువీకరణ పత్రం లేదు.. మా నాన్నది ఎక్కడ తేవాలి. నా పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి. ఇది కోట్లాది మంది ప్రజల సమస్య.. కేంద్రం సమాధానం చెప్పాలి. విభజన రాజకీయాలు ఈ దేశానికి అవసరమా? చొరబాటుదారులను అనుమతించాలని ఎవరూ చెప్పరు. భారతదేశంలో కూడా సరిహద్దు చుట్టూ గోడ కడతారా? ఎవరైనా మాట్లాడితే దేశద్రోహి, పాకిస్తాన్ ఏజెంట్ అని విమర్శిస్తారు. కొత్త ప్రతిపాదనతో ముందుకు వస్తే మద్దతు ఇచ్చే అంశంపై ఆలోచిస్తాం.

- సీఎం కేసీఆర్​

సీఏఏ వ్యతిరేక తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

సంబంధిత కథనాలు: విభజన రాజకీయాలు దేశానికి అవసరమా: సీఎం కేసీఆర్

విభేదాలు సృష్టించేదుకే

సీఎం కేసీఆర్​ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎంఐఎం స్వాగతించింది. ఆ చట్టం దేశ ప్రజల్ని విడదీసేలా ఉందని అక్బరుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. సీఏఏ ముస్లింలకు వ్యతిరేకంగా ఉందన్నారు. ఈ చట్టంతో దిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. కలిసి ఉన్న ప్రజల మధ్య విభేదాలు సృష్టించినట్లైందని విమర్శించారు. ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ నిర్ణయం కోట్లాది మంది ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని పేర్కొన్నారు.

సంబంధిత కథనాలు: 'సీఏఏ, ఎన్​ఆర్​సీలతో దేశం బలహీనపడే ప్రమాదం'

చట్టం తేవాలి

ఎన్​పీఆర్​ వల్ల ఉత్పన్నమవుతున్న పరిణామాలను సభ ద్వారా దేశ ప్రజల దృష్టికి సీఎం కేసీఆర్​ తీసుకొచ్చారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి అంతా ఏకంకావాలని సూచించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి సరిపెట్టుకోకుండా రాష్ట్రంలో అమలు చేయబోమంటూ చట్టం తేవాలని కోరారు

సంబంధిత కథనాలు: ప్రజా ప్రతినిధులకు కూడా జనన ధ్రువీకరణ పత్రాలు లేవు: భట్టి

అసత్యాలు వెనక్కి తీసుకోవాలి

తీర్మాన చర్చలో ముఖ్యమంత్రి, ప్రతిపక్షాలు చేసిన అసత్యాలు వెనక్కి తీసుకోవాలని భాజపా సభ్యుడు రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. కేంద్రం ఇప్పటికే సీఏఏపై అపోహలు తొలగించిందని.. ఆ విషయంపై ఆందోళన అవసరంలేదని తెలిపారు. శాసనసభలో తీర్మానంతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. మైక్​ కట్​ చేయడంతో పోడియం వద్ద ఆందోళనకు దిగిన రాజాసింగ్‌... తీర్మాన పత్రాన్ని చించేసి నిరసన తెలిపారు.

సంబంధిత కథనాలు: సీఏఏ తీర్మాన పత్రాలు చించేసిన రాజాసింగ్

రాజాసింగ్​ వ్యాఖ్యలను ప్రభుత్వం ఖండించింది. ఆ గందరగోళంలోనే తీర్మానాన్ని ఆమోదించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తితో.. మూజువాణి ఓటు ద్వారా శాసనసభ ఆమోదించింది.

Last Updated : Mar 16, 2020, 10:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.