పలు బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.
ఆమోదం పొందిన బిల్లులు
- ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
- ప్రభుత్వ నియామకాల పదవీ విరమణ వయోపరిమితి చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
- విపత్కర వేళ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వోద్యోగుల వేతనాల్లో కోత బిల్లుకు ఆమోదం
- ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
- భవన నిర్మాణ అనుమతులు, స్వీయ ధ్రువీకరణ బిల్లుకు ఆమోదం
- సివిల్ కోర్టుల చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
- జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
- కోర్టు ఫీజులు, సూట్స్ వ్యాల్యుయేషన్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
ద్రవ్య వినియమ, బడ్జెట్ నిర్వహణ బిల్లుపై చర్చ సమయంలో కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు.