రాష్ట్రంలో రెండో రోజు రుణమాఫీ పథకం కింద రూ.100.70 కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. 38,050 మంది రైతులకు లబ్ధి చేకూరిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. అన్నం పెట్టే రైతు అప్పుల బాధల నుంచి బయటపడేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశమని.. మంత్రి పేర్కొన్నారు.
కరోనా విపత్తు నేపథ్యంలో రుణమాఫీకి ఆటంకాలు ఏర్పడ్డాయని చెప్పారు. ఎన్ని ఇబ్బందులున్నా రైతుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని రుణమాఫీ పథకం అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల విశాల ప్రయోజనాలు దృష్ట్యా ప్రభుత్వ హామీ మేరకు ఈ ఏడాది 50 వేల రూపాయల వరకు రుణాల మాఫీ పూర్తి చేస్తున్నామన్నారు. రాబోయే కాలంలో రెండు విడతల్లో రూ. 75 వేలు, 1 లక్ష రూపాయల వరకు ఖచ్చితంగా మాఫీ చేస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇదీచూడండి: Husband Adventure: వాగులో చిక్కుకున్న భార్యను రక్షించేందుకు భర్త ఏం చేశాడంటే..