ETV Bharat / city

కుటుంబం లెక్క తేలాకే రైతు రుణమాఫీ!

author img

By

Published : Jun 11, 2020, 7:27 AM IST

రుణమాఫీకి అర్హులైన రైతు కుటుంబాల లెక్క తేల్చేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఒక్కో రైతుకు కాకుండా ఆ రైతు కుటుంబం మొత్తానికి కలిపి రూ.లక్షలోపు బాకీని మాఫీ చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది.

telangana rythu runa mafi scheme eligibility
కుటుంబం లెక్క తేలాకే మాఫీ!

రుణమాఫీకి అర్హులైన రైతు కుటుంబాల లెక్క తేల్చేందుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం 42.25 లక్షలమంది రైతులు రూ. 26,900 కోట్ల బాకీ ఉన్నట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) తెలియజేసింది. ఒక్కో రైతుకు కాకుండా ఆ రైతు కుటుంబం మొత్తానికి కలిపి రూ.లక్షలోపు బాకీని మాఫీ చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. మొత్తం బాకీదారుల్లో ఒక్కో రైతు కుటుంబ సభ్యులెందరు, రూ.లక్ష లోపు బాకీ ఉన్నవారెందరు అనే వివరాలను వడపోస్తోంది.

‘జాతీయ సమాచార కేంద్రం’ (ఎన్‌ఐసీ) డేటాలో రైతుల సమాచారాన్ని ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసి వడపోత ప్రారంభించింది. రూ.లక్ష లోపు బాకీ ఉన్న ప్రతి ఒక్కరి ఆధార్‌ సంఖ్యను రుణఖాతాతో అనుసంధానం చేసి చూసింది. 2.40 లక్షలమంది ఖాతాల్లో ఆధార్‌ సంఖ్య లేదని తేలింది. ఆ ఖాతాలను వ్యవసాయ విస్తరణ అధికారులకు పంపి ఆధార్‌ నమోదు చేయిస్తోంది.

ప్రతి రైతు ఆధార్‌ ఆధారంగా పౌరసరఫరాల శాఖ నుంచి రేషన్‌కార్డు వివరాలను తీసుకుంది. వాటిని రుణఖాతాలతో పోల్చిచూసి ఒక్కో రైతు కుటుంబ సభ్యుల ఆధార్‌ సంఖ్యలను కలిపి చూస్తున్నారు. రేషన్‌కార్డులో ఉన్న రైతు కుటుంబ సభ్యులందరి ఆధార్‌ సంఖ్యలను ఒకచోట చేర్చి ఏ బ్యాంకులో ఎంత బాకీ ఉన్నారనేది ఆన్‌లైన్‌లో బ్యాంకుల డేటాతో పోలుస్తున్నారు. దీనివల్ల ఒక రైతు కుటుంబంలో ఏ బ్యాంకులో ఎంత రుణం ఉందనే లెక్కలు తేలుతున్నాయి. ఇంకా 2,91,191 మంది రైతుల కుటుంబాల వివరాలు తేలలేదు.

రైతు, అతని భార్య, అతనికున్న పిల్లల పేరుతో భూములు, వాటిపై తీసుకున్న రుణాలన్నీ కలిపి రూ.లక్ష వరకూ ఉన్నవారెందరనేది 42.25 లక్షలమందిలో విడదీసి జాబితాలు తయారుచేస్తున్నారు.

ఒక రైతు కుటుంబానికి ఒక రూ.లక్ష బాకీ చొప్పున తయారుచేస్తే అర్హుల సంఖ్య తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.

అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 3,25,112, నల్గొండలో 3,16,822 మందికి, అత్యల్పంగా హైదరాబాద్‌లో 160, మేడ్చల్‌ జిల్లాలో 9,916 మందికి రూ.లక్షలోపు బాకీ ఉన్నట్లు తేలింది.

రూ.25 వేల లోపు మాఫీ..

ఇప్పటికే రూ. 25,000 లోపు బాకీ ఉన్న రైతులు 5.86 లక్షలమంది అని తేల్చారు. వారి ఖాతాల్లో సొమ్ము జమచేస్తున్నారు. తరవాత రూ. 25,000 నుంచి రూ.లక్ష వరకూ బాకీ ఉన్న రైతు కుటుంబాల లెక్క తేలుస్తారు. వారెందరన్నది తేలిన తరవాత వారికి ఎంత సొమ్ము కావాలనేది ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిస్తుంది. దీనివల్ల రూ. 25,000కు పైగా బాకీ ఉన్నవారి ఖాతాల్లో సొమ్ము జమ కావడానికి మరింత సమయం పడుతుందని అంచనా. వర్షాలు ప్రారంభమైనందున సాగు పనులు ఊపందుకుంటున్నాయి. పెట్టుబడి సొమ్ము బ్యాంకు రుణాల కోసం, రుణమాఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.