లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద అర్చకులు, పురోహితులకు... రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి సాయం చేశారు. సుమారు 100 మంది బ్రాహ్మణులకు నిత్యావసరాలు అందించారు. పేదలకు సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.
లాక్డౌన్ వల్ల ఒక పూట కూడా గడవని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారని... అటువంటి వారికి సాయం చేయగలిగిన ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రమణాచారి విజ్ఞప్తి చేశారు. మొదటి లాక్డౌన్ నుంచి ప్రస్తుత లాక్డౌన్ వరకు కళాకారులను, అర్చకులను, పురోహితులను ఆదుకుంటున్నామని తెలిపారు.