నా తెలంగాణ కోటి రతనాలవీణ అని దాశరథి నినదించారు
నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలన్నదే కేసీఆర్ స్వప్నం
గోదావరి, కృష్ణా జలాలను సమగ్రంగా వినియోగించుకునేందుకు కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైన్ చేశారు
బడ్జెట్‌లో సింహభాగం నిధులు నీటిపారుదల రంగానికి కేటాయింపు
మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి కేసీఆర్ జాతికి అంకితం చేశారు
ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశళ ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం ప్రఖ్యాతి గాంచింది
కాళేశ్వరం స్ఫూర్తితో పాలమూరు-రంగారెడ్డి, సీతారామ వంటి ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా సాగుతున్నాయి
సమైక్య రాష్ట్రంలో తుమ్మలు మొలిచిన ఎస్సారెస్పీ కాల్వలో నేడు నిండుగా ప్రవహిస్తూ కళకళలాడుతున్నాయి
కాళేశ్వరం తొలి ఫలం అందుకున్న జిల్లాలు కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట, ఖమ్మం
మధ్యమానేరు 24 టీఎంసీల నీటితో నిండు కుండలా మారింది
త్వరలోనే రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ నిర్మాణాల పూర్తి
పాలమూరు, రంగారెడ్డి,వికారాబాద్ జిల్లాల రూపురేఖలు మార్చేందుకు పాలమూరు-రంగారెడ్డి పథకం
కాళేశ్వరం మాదిరిగానే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును తక్కువ కాలంలో పూర్తి చేస్తాం
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం
1,000 చెరువుల్లో నీటిని నింపి వలసలు నివారించాం
సింగూర్ కాల్వ నిర్మాణం పూర్తిచేసి 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాం
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం
భక్త రామదాసు ప్రాజెక్టును 11 నెలల్లోనే పూర్తిచేయడం రికార్డు
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని 8 నెలల్లో పూర్తిచేయడం ఒక ఘనత
సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు