ETV Bharat / city

'మానసిక వ్యథే మరింత ప్రమాదకరం... అందుకే మేమున్నాం' - టీం ఉజ్వల సేవలు

కొవిడ్ వస్తే.. ఒంటరిగా ఉండమంటున్నారు కానీ.. మొత్తానికి వారిని వదిలేయమని కాదు. కరోనా బారినపడితే.. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. కుటుంబంలో ఎవరు కరోనా బారినపడ్డా.. మద్దతుగా నిలిచే స్నేహితులు, బంధువులు, తోటివారు లేకపోతే.. వారి పరిస్థితి అత్యంత దయనీయం. ఓ వైపు వ్యాధి కుంగదీస్తుంటే.. మరోవైపు సాంఘిక బహిష్కరణ వారిని మరింత బాధిస్తుంది. అలాంటివారికి మేమున్నామంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. కరోనా బారినపడి హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న వారికి అండగా నిలుస్తూ.. వారు వేగంగా కోలుకోవటంలో భాగం పంచుకుంటున్నారు.

team-ujwala-activities-for-covid-patients-in-home-isolation
'మానసిక కృంగుబాటే ఇంకా ప్రమాదం... అందుకే మేమున్నాం'
author img

By

Published : Sep 10, 2020, 8:13 PM IST

Updated : Sep 10, 2020, 9:59 PM IST

ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాల పిల్లలకు ఎడ్యుకేషన్ మెంటరింగ్ అండ్ ఎంపవరింగ్ స్టూడెంట్స్ మోటివ్​తో టీం-సంభవ ఏర్పాటైంది. హైదరాబాద్ నగరానికి చెందిన కొంత మంది యువత.. ఉద్యోగాలు చేసుకుంటూనే.. గివింగ్ బ్యాక్ టూ సొసైటీలో భాగంగా... వీకెండ్స్​లో సోషల్ సర్వీస్ చేసేందుకు నడుం బిగించారు.

అలా ప్రారంభమైంది..

అనంతపురానికి చెందిన సద్గురునాథ్, జయశ్రీ దంపతులు టీం-సంభవను ఏర్పాటు చేసి.. ప్రభుత్వ పాఠశాలలు, అనాథశరణాలయాల పిల్లలతో వారం వారం ఇంటరాక్ట్ అయ్యేవారు. వారిలో ఉన్న అంతర్గత నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సాహించటం, స్టేజ్ ఫియర్ పోగొట్టడం, మానసికంగా వారిని దృఢం చేసేవారు. వీరి ఆశయానికి నగరవ్యాప్తంగా 250 మంది వాలంటీర్ల మద్దతు తోడైంది. ప్రస్తుతమున్న పరిస్థితులకు అనుగుణంగా... కొవిడ్ బారినపడి ఐసోలేషన్​లో చికిత్స పొందుతున్నవారి కొరకు టీం-ఉజ్వలను ప్రారంభించారు.

'మానసిక కృంగుబాటే ఇంకా ప్రమాదం... అందుకే మేమున్నాం'

వారి కష్టాల గురించే బాధ...

టీం- సంభవ ఫౌండర్ సద్గురునాథ్ కుటుంబంతో సహా.. జులైలో కోవిడ్ బారిన పడి.. ప్రభుత్వ కొవిడ్ కేర్​లో వారంరోజుల పాటు చికిత్స తీసుకున్నారు. మరో వారంపాటు హోం ఐసోలేషన్​లో ఉండి కోలుకున్నారు. ఆ సమయంలో తోటి స్నేహితులు, బంధువులు, వైద్యులు ఇచ్చిన మద్దతుతో కరోనా మహమ్మారి నుంచి వేగంగా బయటపడ్డారు. అదే సమయంలో అయినవారు కూడా పట్టించుకోక, కేర్ టేకర్స్ లేక అవస్థలు పడే బాధితుల కష్టాలు ఆయనను కదిలించాయి.

కరోనా మహమ్మారి బారినపడితే.. ఫిజికల్​గా కన్నా.. మానసికంగా, సాంఘిక బహిష్కరణతో ఎక్కువ నష్టం వాటిల్లుతుందని గ్రహించి.. హోం ఐసోలేషన్​లో ఉన్న వారికి తమ టీం ద్వారా సహాయపడాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా టీం- ఉజ్వలను ప్రారంభించి.. హోం ఐసోలేషన్​లో ఉంటున్న కొవిడ్ బాధితులకు సర్వీస్ అందజేస్తున్నారు.

సర్వీసు అందిస్తూ..

టీం- ఉజ్వల ద్వారా 50 మంది వాలంటీర్లు కొవిడ్ కేర్ సేవలు అందిస్తున్నారు. వైరస్ బారినపడ్డ వ్యాధిగ్రస్తులకు సైకలాజికల్ కౌన్సిలింగ్, కేర్ టేకర్స్, ఫిజికల్ సపోర్ట్ లేని వారికి నిత్యావసరాలు, చికిత్సలో ఉపయోగపడే మందులు వంటివి తమ వాలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఓ వైద్యున్ని నియమించి.. రోగికి రోజుకు ఓ గంట మెడికల్ కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. ఈ క్రమంలో వారు వైరస్ బారినపడకుండా శిక్షణ పొంది.. వ్యక్తిగత భద్రతా ప్రమాణాలు పాటిస్తూ జాగ్రత్త వహిస్తున్నారు.

ఇలా సంప్రదించవచ్చు..

ప్రస్తుతం హైదరాబాద్​లోని అమీర్ పేట్, బేగంపేట్, ఎస్ఆర్ నగర్, మూసాపేట్ ప్రాంతాల్లో వాలంటీర్ల ద్వారా కొవిడ్ కేర్ సేవలు అందజేస్తున్నామని.. మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని నిర్వాహకులు తెలిపారు. కొవిడ్ బారినపడి.. తమ సేవలు పొందాలనుకునే వారు www.teamsambhava.in వివరాలు నమోదు చేసుకోవచ్చని... 7729882258, 9581320310 నంబర్ల ద్వారా తమను సంప్రదించవచ్చని... టీం-సంభవ తెలిపింది.

''బయటకు వెళ్లి కావాల్సిన సరుకులు తెచ్చుకునే సత్తువ లేదు. డబ్బున్న కానీ ఏమి చేయలేని పరిస్థితి. ఆకలి బాధ భరించలేక చనిపోదామనుకున్నా... ఆ సమయంలో టీం-ఉజ్వల సభ్యులు నాకు ఎంతగానో సహాయపడ్డారు. ఇంట్లో మనిషిలా చూసుకున్నారు. వారికి నా ధన్యవాదాలు. వీరి సేవలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా...''

-పావలా శ్యామల, ఆర్టిస్ట్

కొవిడ్ వచ్చిన వారికిి దూరంగా ఉండండి కానీ వారినే దూరం చేసుకోవద్దు అంటున్నారు టీం-ఉజ్వల సభ్యులు.

ఇదీ చూడండి: 'ర్యాపిడ్'​లో నెగెటివ్ వస్తే మళ్లీ టెస్టు తప్పనిసరి!

Last Updated : Sep 10, 2020, 9:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.