రాష్ట్రంలో రెండు పడక గదులు ఇళ్ల నిర్మాణంలో జాప్యానికి నిరసనగా తెలుగుదేశం మహాధర్నా నిర్వహించింది. హైదరాబాద్ ఇందిరా పార్కులోని ధర్నాచౌక్ ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమానికి తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, సీనియర్ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఇతర నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఎల్.రమణ ఆరోపించారు. నాసిరకమైన నిర్మాణాలతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారన్నారు. హామీల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో పేదవారందరికి ఇళ్ల కేటాయింపులు చేసేంత వరకు పోరాడతామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: 'ఇందిరాపార్కు వద్ద తెదేపా మహాధర్నా'