TDP Leaders on Ashok babu arrest: ఎమ్మెల్సీ ఆశోక్‌బాబు అరెస్టును తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లు తీవ్రంగా ఖండించారు. ఏపీ ప్రభుత్వ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. సర్వీస్ మేటర్స్లో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసినందునే అశోక్ బాబుపై ప్రభుత్వం కక్షగట్టిందని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుకు మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.
Lokesh on Ashokbabu Arrest: అర్ధరాత్రి అక్రమంగా అశోక్ బాబును అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నారా లోకేష్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల కోసం అశోక్ బాబు పోరాడుతున్నందుకే ఈ విధంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. పార్టీ అశోక్ బాబుకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
'అర్ధరాత్రి దొంగల్లా అరెస్ట్ చేయాల్సిన అవసరమేమొచ్చింది?'
అబద్దపు పునాదుల మీద అధికారాన్ని చేపట్టిన సీఎం జగన్ .. అరాచకంతో పాలన సాగిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనంద్‌బాబు, ఆలపాటి రాజా, సీనియర్ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. వైకాపా వైఫల్యాలు, తప్పుల్ని పశ్నించిన తెదేపా నేతల్ని అక్రమ కేసులు, అర్దరాత్రి అరెస్టులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. అశోక్ బాబును సీఐడీ అధికారులు అరెస్టు చేయటాన్ని ఖడిస్తున్నట్లు తెలిపిన నేతలు.. అర్దరాత్రి దొంగల్లా వచ్చి అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. గతంలో అశోక్ బాబుపై వచ్చిన ఆరోపణలపై ఆయన ప్రమేయం లేదని విచారణలో తేలినా కుట్రపూరితంగా మళ్లీ కేసు పెట్టడం జగన్ రెడ్డి అరాచక పాలనకు అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడుగా అశోక్ బాబు.. వైకాపా ప్రభుత్వం పీఆర్సీ అంశంలో ఉద్యోగులకు చేసిన మోసం, అన్యాయంపై ఉద్యోగుల్ని చైతన్యవంతం చేస్తున్నాడన్న కడుపు మంటతోనే ఆయనపై కక్ష సాధిస్తున్నారని దుయ్యబట్టారు. అక్రమ కేసులకు భయపడేవారెవరూ తెదేపాలో లేరని... అశోక్ బాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి ఇకనైనా పద్దతి మార్చుకుని పాలన సాగించకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
అశోక్ బాబు న్యాయవాదులను అడ్డుకున్న పోలీసులు
ఎమ్మెల్సీ అశోక్ బాబు తరఫు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కార్యాలయం వద్దకు వచ్చారు. వారిని కార్యాలయం వద్దకు లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. సీఐడీ అధికారులు చెబితేనే కార్యాలయానికి పంపిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: