తెదేపా నేత, మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్లో గుండెపోటుతో తీవ్రంగా ఇబ్బంది పడిన కోడెలను.. బసవతారకం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా.. కోడెల ఆరోగ్యం కుదుటపడలేదు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.
గుండెపోటుతోనే కోడెల కన్నుమూసినట్లు వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. కోడెల ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. కోడెలకు గుండెపోటనే బసవతారకం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.