రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం దిశగా గత కొంత కాలంగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్న పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు... ఇవాళ పార్లమెంట్ కమిటీలను నియమించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయిన ఆయన... మొత్తం 8 స్థానాలకు కమిటీలను నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ ప్రకటనను విడుదల చేసింది. నిజామాబాద్ - యాదగౌడ్ , పెద్దపల్లి - సంజయ్, మహబూబ్ నగర్ - కొండపల్లి రాంచందర్ రావు, నల్గొండ - నెల్లూరు దుర్గా ప్రసాద్, మెదక్ - ఇల్లందు రమేశ్, జహీరాబాద్ - పైడి గోపాల్ రెడ్డి, మల్కాజిగిరి - కందికంటి అశోక్ కుమార్ గౌడ్ , కరీంనగర్ - జోజిరెడ్డిలను పార్లమెంట్ కమిటీ అధ్యక్షులుగా నియమించారు.
వల్లభనేని వంశీ వ్యాఖల ఖండన...
ఆంధ్రప్రదేశ్లో వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి తప్పు పట్టారు. పవిత్రమైన దుస్తుల్లో ఉండి బూతులు మాట్లాడటం ఏంటని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్టీసీ సమస్యను ప్రభుత్వం జటిలం చేస్తోందని మండిపడ్డారు.