ETV Bharat / city

కార్యకర్తలారా.. ఎవరూ నిరుత్సాహపడొద్దు: చంద్రబాబు - chandrababu speaks on municipal elections results

ఏపీ పురపాలక ఎన్నికల ఫలితాలపై తెదేపా శ్రేణులు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నో ప్రలోభాలు, బెదిరింపులను సైతం ఎదుర్కొని గట్టి పోటీనిచ్చారని ప్రశంసించారు.

chandra  babu
కార్యకర్తలారా.. ఎవరూ నిరుత్సాహపడొద్దు: చంద్రబాబు
author img

By

Published : Mar 14, 2021, 8:19 PM IST

  • ప్రస్తుత ఫలితాల విషయానికి వస్తే, నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. రౌడీయిజం, బెదిరింపులు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలు ఉన్నప్పటికీ గట్టిగా పోరాడాం. ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా ముందుకు కొనసాగుదాం. ఇదే స్ఫూర్తితో పనిచేస్తే రాబోయే రోజుల్లో విజయం మనదే.(2/2)

    — N Chandrababu Naidu (@ncbn) March 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఏపీ పురపాలక ఎన్నికల్లో రౌడీయిజం, బెదిరింపులు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలు పెట్టినా తెదేపా శ్రేణులు గట్టిగా పోరాడారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. నేతలు, కార్యకర్తలు పార్టీ విజయం కోసం ఎంతో కష్టపడ్డారన్నారు. కొన్నిచోట్ల ప్రాణాలు సైతం పణంగా పెట్టి పార్టీకి అండగా నిలిచారని.. వారి పోరాటస్ఫూర్తికి వందనాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

ఫలితాల విషయానికి వస్తే.. నిరుత్సాహపడాల్సిన అవసరం లేదంటూ ట్వీట్​ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, ఏపీ భవిష్యత్తు లక్ష్యంగా ముందుకు కొనసాగుదామని పిలుపునిచ్చారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తే రాబోయే రోజుల్లో విజయం మనదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇవీచూడండి: ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్‌..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.